సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్చేరువు తండాలో గిరిజన మోర్చా మాజీ మండలాధ్యక్షుడు భానోతు అనిల్ నాయక్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకున్న నిర్ణయాలే మరోసారి ప్రధాని మోడీ, ఎంపీ బండి సంజయ్ గెలుపుకు నాంది పలికాయన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీ నాయకత్వంలోనే సాధ్యమన్నారు. ఎంపీగా బండి సంజయ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. బండి సంజయ్ ని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక
Post A Comment:
0 comments: