⭕ఎన్నికలు ప్రక్రియ ప్రశాంతం -అందరికి ధన్యవాదములు :జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ⭕డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో సాధారణ ఎన్నికలు- 20 24 ప్రక్రియ స్వేచ్ఛాయుతంగా ప్రశాంతవాతావరణంలో సజావుగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
మార్చి 16 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి జూన్ 6 వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికా రులు , సిబ్బంది తమకు కేటాయిం చిన విధులను జవాబుదారితనంతో బాధ్యతగా చిత్తశుద్ధితో చేపట్టి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కోనసీమ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు ముందు రోజు నుండే ఎన్నికల పోలింగ్ సామగ్రిని తరలించడం దగ్గర నుంచి పోలింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని లెక్కింపు ప్రక్రియ పూర్త యిన పిదప ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు చేర్చి భద్రపరిచే వరకు రెండు రోజుల పాటు శ్రమించి తమకు అప్పగించిన బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు ఉద్యోగులు సిబ్బంది అందరికీ అభినందనలు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రక్రియను ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణం లో నిర్వహించడానికి నిరంతరాయంగా రేయింబవళ్లు రక్షణ పరంగా కృషి చేసిన జిల్లా పోలీసు సిబ్బందికి, కేంద్ర సాయుధ బలగాలకు ధన్యవాదాలు. ప్రజా స్వామ్య వ్యవస్థలకు మరింత బలం చేకూర్చేలా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు విధి విధానాలను రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రజలకు చేరవే యడంతోపాటుగా, క్షేత్రస్థాయిలో ఎన్నికల సంబంధిత సమస్యలను ప్రసారమాధ్యమాల ద్వారా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకుని వచ్చి సకాలంలో సరైన నిర్ణయాలు తీసు కునేలా సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతఙ్ఞతలు. కోనసీమ జిల్లా వాసులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికా రులు,ఉద్యోగులు, సిబ్బంది, ఎవరి స్థాయిలో వారు కీలకంగా వ్యవహరిం చారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతిని ధులు తమ వంతు సామాజిక బాధ్యత పోషించి జిల్లాలో ఎన్నిక లు ప్రశాంత వాతావరణంలో సజా వుగా నిర్వహించేలా సహకరించినం దులకు ధన్యవాదాలుతెలిపారు.
Post A Comment:
0 comments: