ఈ రోజు ఉదయం రాష్ట్ర ఆర్.అండ్.బి శాఖ మంత్రివర్యులు గౌ,, శ్రీ బి.సి.జనర్ధాన్ రెడ్డి గారిని
బనగానపల్లె లోని వారి స్వగృహం నందు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, పార్టీ నాయకులు ఇల్లూరి లక్ష్మయ్య, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు సోమిశెట్టి నవీన్ గార్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సంధర్బంగా సోమిశెట్టి వెంకటెశ్వర్లు గారు బి.సి జనార్ధన్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించడమైనది.
గత వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రోడ్లు గుంతలు ఏర్పడి ప్రయాణానికి ఇబ్బందిగా ఉండేదని, అయితే ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని రోడ్లు బాగు చేయించి ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని జనర్ధన్ రెడ్డి గారిని సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు కోరడమైనది.
Post A Comment:
0 comments: