kapunews



TRENDING NOW




* *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది*

 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వాడిది టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటి నిర్వహణపై వినతి పత్రం సమర్పించడం జరిగింది*

 *నరసరావుపేట జిల్లా కార్యాలయంలో ఈ సోమవారం అనగా మే 12వ తేదీన ఉదయం 10 గంటల నుండి 2 గంటలవరకు జనతా వారది కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది*

 *జనతా వారది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది*

 *ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జనతా వారి కార్యక్రమం ప్రతి గురువారం అన్ని మండలాలలో పార్టీ కార్యాలయలలో అలాగే ప్రతి శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది అలాగే పల్నాడు జిల్లా జనతా వారధి టీం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రాలు స్వీకరించటం జరుగుతుందని తెలియజేసిన పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*

 *మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అలాగే శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయం లో వచ్చే ఫిర్యాదులను అన్నింటిని సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వం వారికి ఫిర్యాదులు అందజేయడం జరుగుతుందని పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు తెలియజేశారు*

“ *నీరు ఉంటేనే జీవితం ఉంటుంది*

*విషయం : భూగర్భ జలాల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుద్ధ్యం, భవిష్యత్ నీటి భద్రత*

*ప్రస్తుతం వాతావరణం లో వస్తున్న మార్పుల కారణంగా  వర్షపాత సరళిలో అనిశ్చితి, పెరుగుతున్న భూగర్భ జల వినియోగం, ఎండిపోతున్న బోర్లు,  క్షీణిస్తున్న చెరువుల సంఖ్య మరియు ఆయకట్టు ఇవన్నీ భవిష్యత్ తరాలకు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సూచిస్తున్నాయి*

ఈ పరిస్థితులను అధిగమించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నీటి భద్రత కల్పించడానికి రాష్ట్రంలో జలవనరుల సక్రమ నిర్వహణ మరియు భూగర్భ జల రీచార్జ్ కు ఇంకుడు గుంటలు (సోక్ పిట్స్, రీచార్జ్ పిట్స్), చెక్ డ్యాం లు, పెర్కొలేషన్ టాంక్ లు, రీచార్జ్ షాఫ్ట్ లు మొదలైన నిర్మాణాల విస్తరణ, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి.

ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో బోర్లు ఎండిపోతున్నాయి, వేసవిలో తాగునీటి కొరత, వ్యవసాయానికి నీటి సమస్యలు, మురుగునీటి నిల్వ, వర్షపు నీరు కాలువల్లో వృథాగా పోవడం వంటి సమస్యలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచడానికి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే శాశ్వత పరిష్కారాల్లో ఇంకుడు గుంటలు (సోక్ పిట్స్ & రీచార్జ్ పిట్స్) ముఖ్యమైనవి.

రీచార్జ్ పిట్స్: వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది; భూగర్భ జల స్థాయి పెరుగుతుంది; బోర్లు, బావులు ఎక్కువకాలం పనిచేస్తాయి; వరద ప్రభావం తగ్గుతుంది; భూమి తేమ పెరిగి వ్యవసాయానికి మేలు చేస్తుంది.

సోక్ పిట్స్: ప్రతి ఇంటినుండి వచ్చే గ్రే వాటర్ భూమిలోకి ఇంకుతుంది; మురుగునీటి నిల్వ తగ్గుతుంది; దోమలు, దుర్వాసనలు తగ్గుతాయి; పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది నిరంతర భూగర్భ జల రీచార్జ్ జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం V B G RAM G, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ్ భారత్ మిషన్ వంటి పథకాల ద్వారా రైన్‌వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్‌వాటర్ రీచార్జ్, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్‌ పై రాష్ట్రాలకు నిధులు, సాంకేతిక మార్గదర్శకాలు, జియో-ట్యాగింగ్, మానిటరింగ్ వ్యవస్థలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది.  “ ప్రతి వర్షపు నీటి చుక్క భూమిలోకి చేరాలి ” అనే లక్ష్యంతో ప్రోత్సాహం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ కీలకం. 2019 వరకు సుమారు 2 లక్షల ఇంకుడు గుంటలు నిర్మించబడ్డాయి. అయితే, తర్వాత నిర్మాణాలు ఆగిపోయాయి; ఉన్నవి నిర్లక్ష్యంతో పూడికతో నిండిపోయాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ కార్యక్రమాలను నిర్వీర్యం చేసింది. 2024 – 2025 లో భూగర్భ జల రీఛార్జ్ లక్ష్యంగా ఇంకుడు గుంటల నిర్మాణం ప్రారంభించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కార్యక్రమం అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లడం లేదు.

భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పిట్స్ అవసరం ఉన్నప్పటికీ అమలు తగిన స్థాయిలో లేదు. ప్రతి గ్రామం మరియు పట్టణాలలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు, వంటి నిర్మాణాల వద్ద రీఛార్జ్ పిట్స్, ట్రెంచ్ లు, రీఛార్జ్ వెల్స్ నిర్మించాలని, మరియు  రోడ్డు డ్రైనేజ్, ఇంటినుండి వచ్చే గ్రే వాటర్ వద్ద సోక్ పిట్స్ వంటి నిర్మాణాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, లోపాలు ఎక్కువై లక్ష్యాల కోసం పనులు మొక్కుబడిగా పూర్తి చేయడం, సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడం, నాణ్యత లేని నిర్మాణాలు, నిర్వహణా లోపం, మట్టితో నిండిపోవడం, పూర్తి కాని పనులను పూర్తి చేసినట్టు చూపడం, ప్రజల్లో అవగాహన లోపం, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రామ స్థాయి పర్యవేక్షణ లేమి కనిపిస్తున్నది.

ఇట్టి పరిస్థితులలో అధికారులు క్రింది అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి 

1. రాష్ట్రవ్యాప్త “గ్రౌండ్‌వాటర్ రీచార్జ్ మిషన్” ప్రారంభించాలి.
2. ప్రతి గ్రామానికి వార్షిక భూగర్భ జల రీచార్జ్ టార్గెట్ నిర్ణయించాలి.
3. ప్రతి ఇంటికి తప్పనిసరిగా రీఛార్జ్ పిట్ మరియు సోక్ పిట్ ఉండాలనే నిబంధన అమలు చేయాలి.
4. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు భవనాలలో వర్షపునీటి సంరక్షణ మరియు భూగర్భ జల రీఛార్జ్ తప్పనిసరి చేయాలి.
5. గ్రామాలలో, పట్టణాలలోని వ్యవసాయ మరియు మంచినీటి చెరువులన్నింటిలో పూడిక తీయడం, చెరువులలోనికి వచ్చే కాలువలను, మార్గాలను శుభ్రం చేయడం వంటి పనుల వార్షిక నిర్వహణకు నిధులు కేటాయించి రైతులు, ప్రజల భాగస్వామ్యం తో ప్రతీ సంవత్సరం తప్పక చేపట్టాలి.
6. ప్రతి పనికి మరియు నిర్మాణానికి జియో-ట్యాగింగ్ & పబ్లిక్ మానిటరింగ్ అమలు చేయాలి.
7. నాణ్యత తనిఖీలకు థర్డ్ పార్టీ ఇన్‌స్పెక్షన్ ఏర్పాటు చేయాలి.
8. గ్రామస్థాయి వాటర్ కమిటీలు ఏర్పాటు చేయాలి మరియు గ్రామ వాటర్ బడ్జెట్ అంచనాలు తయారు చేయించాలి.
9. గ్రామసభల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి గ్రామస్థాయిలో నీటి వనరుల నిర్వహణలో భాగస్వాములను చేయాలి.
10. భూగర్భ జల రీఛార్జ్ నిర్మాణాల నిర్వహణకు ప్రత్యేక వార్షిక నిధి ఏర్పాటు చేయాలి.
11. బావులు, బోర్లు ఎండిపోతున్న మండలాలకు ప్రత్యేక రీచార్జ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి.
12. విద్యా సంస్థలలో వర్షపు నీటి సంరక్షణ మరియు భూగర్భజల రీఛార్జ్ లపై మరియు జలవనరుల సంరక్షణ, సక్రమ నిర్వహణలపై భవిష్యత్ తరాలకు ప్రతినిధులైన విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలతో ప్రతీ సంవత్సరం తగిన అవగాహన, శిక్షణ కల్పించాలి. 

పై అన్నిరకాల కార్యక్రమాల అమలులో అధికారుల నిర్లక్ష్యంపై బాధ్యత నిర్ణయించే వ్యవస్థ తీసుకురావాలి.

ఈ అంశాన్ని సాధారణ అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా, భవిష్యత్ తరాల జీవన భద్రత గా పరిగణించి అత్యవసర ప్రాధాన్యతతో చర్యలు చేపట్టాలని మనవి. 

ఈ రోజే గ్రామ స్థాయి నుంచి నీటి సంరక్షణను ఉద్యమంగా మార్చాలి. “ ప్రతి వర్షపు చుక్క భూమిలోకి చేరాలి—ప్రతి గ్రామం నీటి భద్రత కలిగిన గ్రామంగా మారాలి .”
ప్రభుత్వం ఈ మహత్తర లక్ష్యంతో బలమైన కార్యాచరణ చేపడుతుందని ఆశిస్తూ, ఈ వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాము.



శావల్యాపురం  మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

  జనతా వారిది కార్యక్రమాన్ని శావల్యాపురం  మండలంలోని భాస్కర్ నగర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మంచినీటి పథకం కు మరమ్మత్తులు చేసి త్రాగునీరు సరఫరా చేయాలని, గ్రామం నుండి స్మశానానికి వెళ్లే రహదారి గోతులు మయంగా వర్షాకాలంలో  బురదమయంగా మారిందని ఈ రహదారికి మరమ్మత్తులు చేయాలని, అలాగే గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి మాలపాటి లక్ష్మారెడ్డి అనే యువకుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని  దరఖాస్తులు రావడం జరిగింది, వీటి పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు సీనియర్ నాయకులు అన్నవరపు శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.



*
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమితులైన రాపెల్లి భరత్*


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమితులైన రాపెల్లి భరత్. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా రాపెల్లి భరత్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన రాపెల్లి భరత్.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన రాపెల్లి భరత్.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన రాపెల్లి భరత్.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన రాపెల్లి భరత్.

 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కన్వీనర్ రాపెల్లి భరత్ అన్నారు.



*నరసరావుపేట జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

 *నరసరావుపేట జిల్లా కార్యాలయంలో ఈ శుక్రవారం అనగా మే 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి 12 గంటలవరకు జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల నుండి భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త  అయినటువంటి ఉడత ప్రసాదరావు తన తండ్రి మిలటరీలో పని చేసిన సందర్భంగా  ప్రభుత్వం ద్వారా దుర్గి మండలం కోలగుట్ల గ్రామంలో సర్వే నెంబరు 989 లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వటం జరిగింది*

 *సదరు తనకిచ్చిన ఈ భూమి రెవెన్యూ వారు సర్వే చేసి తనకు అప్పగించవలసినదిగా కోరుతూ జనతా వారధి కార్యక్రమం లో  పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది*

 *సదరు విషయాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు రెవెన్యూ వారిని సంప్రదించగా సర్వే నిమిత్తం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు*

 *జనతా వారది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది*

 *ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జనతా వారి కార్యక్రమం ప్రతి గురువారం అన్ని మండలాలలో పార్టీ కార్యాలయం లో అలాగే ప్రతి శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది తెలియజేసిన పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*

 *మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అలాగే శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయం వచ్చే ఫిర్యాదులను అన్నింటిని సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వం వారికి ఫిర్యాదులు అందజేయడం జరుగుతుందని పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు తెలియజేశారు*



 
 
 
*చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో  జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

 రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం, మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్  గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని  చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు కోట పవన్ కుమార్ గాంధీ  ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ శాఖ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
 ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు చెందిన నేలటూరి ఏసురత్నం తన ఆధీనంలో ఉన్న స్థలాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్సిపి నాయకులు తనకు తెలియకుండానే రెవెన్యూ రికార్డులు మార్పు చేయడంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . ఈ ఫిర్యాదుని బిజెపికి సంబంధించిన వెబ్సైట్లో పొందుపరచడం కూడా జరిగింది.
 
సదరు ఈ విషయంపై ఆర్ ఓ ఆర్ యాక్ట్ ప్రకారము జనతా వారధి టీం ద్వారా ఆర్డిఓ గారికి ఫిర్యాదు చేయటం జరిగింది.
 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ మాజీ పట్టణ అధ్యక్షుడు దడబడ పుల్లయ్య పట్టణ కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


 
*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్*


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన నంద్యాల జిల్లా కన్వీనర్ గా నియమితులైన గంటా వెంకట నరసయ్య యాదవ్. జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా గంటా వెంకట నరసయ్య యాదవ్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన గంటా వెంకట నరసయ్య యాదవ్.

 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కన్వీనర్ గంటా వెంకట నరసయ్య యాదవ్ అన్నారు.



*విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*

 *ప్రజల పక్షాన బీజేపీ - "జనతా వారధి" విజయపథం*
  
​ *విజయవాడలోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, గౌరవనీయులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు అధ్యక్షతన నిర్వహించిన "జనతా వారధి" రివ్యూ సమావేశానికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు హాజరుకావడం జరిగింది*

 *సమీక్షా సమావేశంలో పలనాడు జిల్లాలో ఇప్పటివరకు జరిగిన జనతా వారిది కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు రాష్ట్ర జట్టుకు అందించడం జరిగింది . వాటిని పరిశీలించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ను సభాముఖంగా అభినందించడం జరిగింది*

   ​*ఈ సందర్భంగా మాధవ్ గారు "జనతా వారధి" కార్యక్రమ పురోగతిని సమీక్షించి, ప్రజల సమస్యలను మరింత వేగంగా మరియు సమర్థవంతంగా పరిష్కరించడానికి మాకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఎలా పని చేయాలో ఆయన విలువైన మార్గదర్శకాలను అందించారు.
4000+ అర్జీల స్వీకరణ వేలాది మంది ప్రజలు మాపై నమ్మకంతో సమస్యలను విన్నవించారు*

​70% పరిష్కార దిశగా అందిన అర్జీలలో అత్యధిక శాతాన్ని సానుకూల పరిష్కారానికి తీసుకెళ్లగలిగాం.
​ప్రతి శుక్రవారం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రజల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
​ప్రజల కన్నీళ్లు తుడిచే వరకు, వారి గొంతుకగా నిలిచే వరకు భారతీయ జనతా పార్టీ  కృషి చేస్తుంది. మీ సమస్యే మా బాధ్యత!


 
 
*TVK విజయ్ కులం ఏది గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారంట...*

*దళపతి విజయ్ నేపథ్యం: సోషల్ మీడియా ప్రచారం vs వాస్తవాలు*
తమిళనాడు రాజకీయాల్లో మార్పు లక్ష్యంగా వచ్చిన విజయ్ గురించి ప్రస్తుతం గూగుల్‌లో ఆయన కులం, మతం గురించి నెటిజన్లు ఎక్కువగా వెతుకుతున్నారు. ముఖ్యంగా ఆయన 'దళిత' సామాజిక వర్గానికి చెందినవారనే ప్రచారం సాగుతుండగా, దీనిపై కథనం స్పష్టతనిచ్చింది.
*1. కులం మరియు మతంపై స్పష్టత:*
 *తండ్రి నేపథ్యం:* విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతస్థుడు. వీరి కుటుంబం తమిళనాడులోని రామేశ్వర తీర ప్రాంతానికి చెందిన సంపన్న *వెల్లాలర్ (OC)* సామాజిక వర్గానికి చెందినది. అందుకే విజయ్ పూర్తి పేరు 'జోసెఫ్ విజయ్' అని ఉంటుంది.
 *తల్లి నేపథ్యం:* విజయ్ తల్లి శోభ ఒక తమిళ *బ్రాహ్మణ* కుటుంబానికి చెందినవారు.
 *విజయ్ వైఖరి:* విజయ్ తనను తాను ఏ ఒక్క కులానికో, మతానికో పరిమితం చేసుకోకుండా 'భారతీయుడిని' అని చెప్పుకుంటారు.
*2. 'నో క్యాస్ట్' సర్టిఫికేట్:*
చాలా మంది నాయకులు కుల బలంతో రాజకీయం చేయాలని చూస్తుంటే, విజయ్ మాత్రం దశాబ్దాల క్రితమే తన విద్యా ధ్రువీకరణ పత్రాల్లో (Certificates) కులం కాలమ్ దగ్గర *'నో క్యాస్ట్' (No Caste)* అని నమోదు చేయించుకున్నారు. కులాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యమని ఆయన నమ్ముతారు.
**3. సోషల్ మీడియాలో 'దళిత' ప్రచారం ఎందుకు?**
విజయ్ తన పార్టీ జెండా ఆవిష్కరణలో మరియు సిద్ధాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పెరియార్ వంటి మహనీయుల పేర్లను ప్రస్తావించడం, సామాజిక న్యాయం గురించి మాట్లాడటంతో ఆయనను ఒక వర్గానికి కట్టేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోందని కథనం పేర్కొంది. అంబేద్కర్ ఆశయాలను అనుసరించినంత మాత్రాన ఒక వర్గానికి చెందిన వారు కాదని, సమ సమాజం కోసం పోరాడే ప్రతి నాయకుడు అందరివాడేనని స్పష్టం చేసింది.

సినిమాల్లోనూ, ఇప్పుడు రాజకీయాల్లోనూ కుల ప్రస్తావన లేకుండా పారదర్శకతను పాటిస్తున్న విజయ్, ప్రజల్లో నాటుకుపోయిన ఈ కుల జాడ్యాన్ని ఎలా తుడిచివేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వ్యక్తిని కులాన్ని బట్టి కాకుండా కార్యదక్షతను బట్టి చూడాలన్నదే విజయ్ సిద్ధాంతంగా కనిపిస్తుంది



 
 
 
*విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ*

దిల్లీ: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది.

 2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డీపీఆర్కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

ఈ జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా 3వేల మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1200 మంది అవసరం, జోన్ అంతటా 17వేల మంది వరకు పనిచేస్తారు.



 
 
 
*ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు*

అమరావతి :

ఏపీ రాష్ట్రానికి కేంద్రం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని సీఈఎస్ఎల్ సీఈఓ అఖిలేష్ కుమార్ తెలిపారు. 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్ పిలిచినట్లు ఆయన తెలిపారు. దీనితో, 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో విద్యుత్ రవాణాను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నానికి 150 బస్సులు, తిరుపతికి 300 బస్సులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు....

 
 
నెల్లూరు బ్రేకింగ్... ఏసిబి ట్రాప్ లో లైన్మెన్....... 

నెల్లూరు జిల్లా, మనుబోల మండలం కొలనకుదురు  గ్రామానికి చెందిన, రైతు సుకూర్ అహ్మద్ నుండి  లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా లైన్మెన్ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న, ఏసీబీ అధికారులు .....

రొయ్యల గుంటలను కొనుగోలు చేసినఫిర్యాదుదారుడు  షేక్ సుకుర్ అహ్మద్ తన భార్య అయిన నజీమా పేరును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడానికి  1,50,000 లంచం డిమాండ్ చేసిన లైన్మెన్ రమేష్.... 

తొలివిడత 50,000 గుట్టు చప్పుడు కాకుండా లంచం తీసుకున్న, లైన్మెన్ రమేష్....

నేడు మిగిలిన లక్ష రూపాయలను సబ్స్టేషన్లో రైతు వద్ద నుండి తీసుకుంటుండగా... లైన్మెన్ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

*సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్*


 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నూతన తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన మాన్ మోహన్ గౌడ్ . జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్నా మాన్ మోహన్ గౌడ్ తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి హిందూ సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

 అలాగే హిందూ సమాజ అభివృద్ధికి పని చేస్తున్న ఇతర హిందూ ధార్మిక సంస్థలతో సంస్థ తరఫున వారితో కలిసి పని చేస్తూ హిందూ సమాజం అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

 సంస్థ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేసిన మాన్ మోహన్ గౌడ్.

 హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోమాతను సంరక్షించుకునే బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కన్వీనర్ మాన్ మోహన్ గౌడ్ అన్నారు.



 
*చిత్తూరు జిల్లా లొ ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి దారుణ హత్యను ఖండించిన కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు*


*చిత్తూరు జిల్లాలో ఓ పత్రికా విలేకరిని చంపేశారు. వి.కోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయాన్నే ఆయన వాకింగ్ చేసే సమయంలో  కొంతమంది వ్యక్తులు వెంటాడి ఇంటికి సమీపంలోనే కత్తులతో నరికి చంపేశారు. ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు..ఇలాంటోళ్ళు నెల్లూరు రూరల్ మండలం లో MLA మాదిరిగా చెలరేగి పోతున్నారు ఈ దారుణ హత్యకు పాల్పడ్డ వ్యక్తులు ఎటువంటి వారైనా సరే వదిలిపెట్టకుండా పోలీసు వారు తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్  అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు*


*చిలకలూరిపేటలో మారుమోగిన గోమాత నామస్మరణ: తహసిల్దార్‌కు హిందూ సంఘాల వినతికార్యక్రమం లొ పాల్గొన్న సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి* 


*చిలకలూరిపేట, ఏప్రిల్ 27, 2026:*
భారతీయ సంస్కృతికి మూలస్తంభమైన గోమాతను సంరక్షించుకోవడమే ధ్యేయంగా నేడు చిలకలూరిపేట పట్టణంలో హిందూ సంఘాలు మరియు గో సేవకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ నుండి ప్రారంభమై దేశం నలుమూలలా సాగుతున్న ఈ గోమాత పూజా కార్యక్రమాలు మరియు ర్యాలీల పరంపరలో భాగంగా, నేడు స్థానిక పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

 *ర్యాలీ విశేషాలు:* 
భారీ ప్రదర్శన: పట్టణ ప్రధాన వీధుల గుండా వందలాది మంది గో సేవకులు, భక్తులు గోమాత చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు.

 *గోమాత శరణు ఘోష:* ర్యాలీ పొడవునా భక్తులు చేసిన "గోమాత శరణు" నినాదాలతో చిలకలూరిపేట పురవీధులు మారుమోగాయి.

 *పూజా కార్యక్రమాలు:* మార్గమధ్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భారతీయ జీవన విధానంలో ఆవు యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పారు.

 *వినతిపత్రం సమర్పణ:* 
ర్యాలీ అనంతరం హిందూ సంఘాల ప్రతినిధులు స్థానిక 
తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. గోవుల సంరక్షణకు కఠిన చట్టాలు అమలు చేయాలని, గోవధను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తహసిల్దార్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు.

> "గోమాత కేవలం ఒక జంతువు కాదు, అది కోట్లాది మంది భారతీయుల విశ్వాసం. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ చైతన్య యాత్రలో భాగంగా చిలకలూరిపేటలో ఈరోజు భారీ స్పందన లభించింది." అని సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక హిందూ ధర్మ ప్రచారకులు, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో గో ప్రేమికులు పాల్గొన్నారు.

 
 
*పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారాధి కన్వీనర్ మరియు ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా విజయ భాస్కర్ రెడ్డి గారు  పల్నాడు జిల్లా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి  ధార గుప్తా గారు పల్నాడు జిల్లా జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*

 మహారాజశ్రీ పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అధికారి గారి దివ్యసముఖమునకు వ్రాసుకున్న అర్జీ


విషయం: నైపుణ్యం పెంచండి… నిరుద్యోగం తగ్గించండి 

రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి, స్థానిక ఉద్యోగాలు, చేతివృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయవలెనని వినతి

“మీ సమస్య… మా బాధ్యత” అనే భరోసా తో భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయాల్లో ప్రజల సమస్యలను స్వీకరిస్తూ, గ్రామాలు–నగరాల్లో పర్యటిస్తూ ప్రజల ఆకాంక్షలను తెలుసుకుంటున్నాము. ఇటీవల భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా యువతను కలసి వారి సమస్యలు, ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుంది. ఈ కార్యక్రమాల్లో SC, ST, OBC, మహిళలు, చేతివృత్తిదారులు, నైపుణ్య శిక్షణలో ఉన్నవారు, నిరుద్యోగులు, చిన్న చదువులతో సరైన జీవన మార్గం తెలియని యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాము.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు “జిల్లాకో నైపుణ్య కేంద్రం” ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ ప్రణాళికలు కేవలం సమావేశాలు, నివేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించేలా అమలు కావాల్సిన అవసరం ఉందని అధికారులు ఆ దిశగా ఆలోచించాలి అని మనవి చేస్తున్నాము. రాష్ట్రంలో యువత నుంచి వస్తున్న వినతుల్లో గణనీయమైన వాటా ఉద్యోగాల కోసమే ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది; ఇది తక్షణ చర్యలు అవసరమని సూచిస్తోంది 

కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చి, Skill India Mission, PMKVY 4.0, PM-NAPS, Jan Shikshan Sansthan, PM Vishwakarma, Digital India, Startup India, Mudra, Stand Up India, PM-SETU వంటి అనేక పథకాల ద్వారా యువతకు, చేతివృత్తిదారులకు, స్వయం ఉపాధి ఆశావహులకు శిక్షణ, మద్దతు, రుణాలు, టూల్‌కిట్లు, పరిశ్రమల అనుసంధానం వంటి అవకాశాలు కల్పిస్తోంది. ఈ అవకాశాలు రాష్ట్రంలో సమర్థవంతంగా వినియోగించబడితే లక్షలాది కుటుంబాలకు ఉపయుక్తం అవుతాయి 

అయితే, యువత నుంచి మాకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం, పథకాలు ఉన్నప్పటికీ పరిశ్రమలకు సరిపోయే నైపుణ్యం కొరతగా ఉంది; శిక్షణ ఒకటి, పరిశ్రమల అవసరం మరోటి అన్న పరిస్థితి నెలకొంది. సర్టిఫికెట్ ఉన్నా ప్రాక్టికల్ స్కిల్ లేకపోవడం, ప్లేస్‌మెంట్‌పై తక్కువ దృష్టి, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం పేరుతో ఉన్న నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, స్కూల్ స్థాయి నుంచే vocational education బలహీనంగా ఉండటం, తక్కువ జీతాలు, నైపుణ్యం ఉన్నవారి వలసలు, చేతివృత్తుల పట్ల నిర్లక్ష్యం, డేటా ట్రాకింగ్ లోపం వంటి సమస్యలు తీవ్రమైనవిగా గుర్తించాము. రాష్ట్రంలో ఇటీవల జిల్లాకో నైపుణ్య ప్రణాళిక, పరిశ్రమలకు అనుగుణ శిక్షణ, టెన్త్ విద్యార్థుల ట్రాకింగ్ వంటి అంశాలపై చర్యలు ప్రారంభమైనట్లు వార్తలు వచ్చినప్పటికీ, అవి వేగంగా మరియు సమగ్రంగా అమలు కావాల్సిన అవసరం ఉంది 

కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కింది అంశాలను అత్యంత ప్రాధాన్యంతో పరిగణనలోకి తీసుకుని వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని మనవి చేస్తున్నాము

ప్రతి జిల్లాలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా Skill Map తయారు చేయాలి. పోర్టు, ఐటీ, షిప్పింగ్, ఆటోమొబైల్, సోలార్, మైనింగ్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఆయిల్ & గ్యాస్, అక్వా, ఫిషరీస్, పేపర్, అగ్రో రంగాలకు సరిపడే శిక్షణ మాడ్యూల్స్ రూపొందించాలి. మండల స్థాయిలో Skill Centers ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు సులభంగా చేరువ చేయాలి. SC, ST, BC, మహిళలు, డ్రాప్‌అవుట్స్, చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక స్కిల్ ప్యాకేజీలు అమలు చేయాలి. శిక్షణతో పాటు placement or loan అనే మోడల్‌ను పటిష్టంగా అమలు చేయాలి. ప్రతి MoUలో ఉద్యోగాల సంఖ్య, శిక్షణ లబ్ధిదారుల సంఖ్య, నియామకాల లక్ష్యాలు స్పష్టంగా ప్రకటించాలి. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగ, శిక్షణ సమాచారం నిరంతరం ప్రచారం చేయాలి. vocational education ను స్కూల్ స్థాయి నుంచే బలోపేతం చేయాలి. తక్కువ చదువు ఉన్న యువత, డ్రాప్‌అవుట్స్, సంప్రదాయ చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక మార్గాలు  రూపొందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా డేటా ట్రాకింగ్, ఫలితాల మానిటరింగ్, ప్లేస్‌మెంట్ సమీక్ష వ్యవస్థను బలపరచాలి. చేతివృత్తులు కేవలం జీవనోపాధి కాదు; అవి సంస్కృతి, కుటుంబ గౌరవం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది. అందువల్ల వాటికి ఆధునిక నైపుణ్య శిక్షణ, పరికరాలు, రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారి జీవన ప్రమాణం గణనీయంగా మెరుగుపడుతుంది. అలాగే స్థానికులకు ఉద్యోగాలు లభిస్తే వలసలు తగ్గి, కుటుంబాల ఆర్థిక భరోసా పెరుగుతుంది. 

యువతకు ఉద్యోగం కల్పించడం అంటే ఒక్క వ్యక్తికి ఉపాధి కల్పించడం కాదు అది ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం. నైపుణ్యాభివృద్ధి అంటే కేవలం శిక్షణ కాదు; అది రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే సమగ్ర అభివృద్ధి ఉద్యమం.
అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకొని, నిధులు, పథకాలు, సాంకేతిక సహాయం, పరిశ్రమల సమన్వయం, నియామక హామీలు కలిపి సమగ్ర కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మనవి చేస్తున్నాము.

జనతా వారధి పల్నాడు జిల్లా జట్టు