✍️రాష్ట్ర మంత్రి సుభాష్ ను కలిసిన జిల్లా అధికారులు✅ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికై మరియు రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవల శాఖ మంత్రిగా నియమితులైన వాసంశెట్టి సుభాష్ ను బుధవారం ఉదయం అమ లాపురం లోని ఆయన నివాసంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కలసి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చా న్ని అందించి శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా నికి చెందిన రాజకీయ నాయకు డుగా ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రామచంద్రపురం నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ్యులుగా అసెంబ్లీకి ఎన్నికయ్యారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వాసంశెట్టి సుభాష్ కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవల శాఖ మంత్రిగా నియమింపబడ్డారన్నారు. వాసంశెట్టి సుభాష్ రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తని ఆయన ఎస్ ఏ.ఎఫ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి గుర్తింపును పొందారన్నారు.వాసంశెట్టి సుభాష్ తొలిసారి రామచంద్ర పురం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై జూన్ 12 న కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టారన్నారు. మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ పరిశ్రమల్లో ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలపై తగు పరి ష్కారం చూపి కార్మికులకు అండగా నిలుస్తానన్నారు. కార్మిక సమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అదేవిధంగా కార్మిక సంక్షేమానికి అన్ని విధాల సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీధర్ కూడా పాల్గొని నూతనంగా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వాసంశెట్టి సుభాష్ వారిని మర్యాదపూర్వకంగా పూల బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment:
0 comments: