ED: అంతిమ లబ్ధిదారునికి నగదు ఎలా చేరవేశారు?.. రాజ్ కెసిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ


మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు.


విజయవాడ: మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్


కెసిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. నిన్న ఉదయం 10 నుంచి సాయత్రం 5గంటల వరకు ఈడీ అధికారులు జైల్లో రాజ్ కెసిరెడ్డి నుంచి సమాచారం రాబట్టారు. మద్యం కేసులో నగదు అక్రమ రవాణాపై కెసిరెడ్డిని ప్రశ్నించారు. ఇద్దరు ఈడీ అధికారులు ఏడు గంటల పాటు రాజ్ కెసిరెడ్డి ద్వారా మద్యం కుంభకోణం నగదు లావాదేవీలు రాబట్టారు. సుమారు 100 ప్రశ్నలు అడిగి స్టేట్ మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం.


మద్యం కుంభకోణంలో నెట్ వర్క్ ద్వారా కమీషన్ రూపంలో వసూలు చేసిన నగదు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు? ఏ రంగాల్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు? ఎన్ని బ్యాంక్ ఖాతాలు వినియోగించారు? ఏ విధంగా నగదును అక్రమ రవాణా చేశారు? మద్యం కుంభకోణంలో వచ్చిన నగదుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు? అంతిమ లబ్ధిదారునికి నగదును ఎలా చేరవేశారు? అనే విషయాలకు సంబంధించి ప్రశ్నలను సంధించి రాజ్ కెసిరెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మద్యం స్కామ్లో జరిగిన అక్రమ లావాదేవీలపై మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈడీ కేసు నమోదు చేసింది.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: