హరిదాసును సత్కరించిన జయ జయ సాయి ట్రస్ట్ సభ్యులు -- -చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు మకర సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఉదయం నుంచి శ్రీ దత్త సాయికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం దాతల సహకారంతో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది సంక్రాంతి పండగలో భాగంగా ఈరోజు సంక్రాంతి సాంప్రదాయాలను గుర్తుచేసే హరిదాసును ట్రస్టు ఆధ్వర్యంలో హరిదాసును సత్కరించి వారికి ఒక వారానికి సరిపడే బియ్యము దక్షిణ ఇవ్వడం జరిగింది ట్రస్టు చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ హరిదాసులకు సహకరించాలని హరినామ సంకీర్తన చేస్తూ ప్రతి ఊరులోనూ ప్రతి వీధిలోనూ తిరుగుతూ మన యొక్క కర్మలను తాను స్వీకరించి మనకు అనంత పుణ్యఫలాలను ప్రసాదిస్తున్నారని ప్రతి ఒక్కరూ హరిదాసులను గౌరవించాలని మన పండగలు హాజర సాంప్రదాయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతూ తెలియజేస్తూ ముందుకు సాగాలని సనాతన ధర్మం యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజేయాలని హరికి దాసుడు హరిదాసుడు అని హరినామ సంకీర్తనలతో వీధి వీధిని పుణ్య శ్లోకాల ద్వారా జాగృతి పరిచి పండక్కు ఒక కలను ప్రసాదిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

Post A Comment:
0 comments: