కుంభమేళాను తలపించిన సరస్ మేళా : ప్రత్తిపాటి
• ముఖ్యమంత్రి వినూత్న ఆలోచన, కేంద్రమంత్రి పెమ్మసాని కృషి వల్లే అఖిలభారత డ్వాక్రా బజార్ గుంటూరులో ఏర్పాటైంది.
• స్వయం సహాయక సంఘాల మహిళలు నాణ్యమైన ఉత్పత్తులు.. చౌక ధరకే అందుబాటులో.
• గుంటూరులోని సరస (అజీవిక) మేళాను సందర్శించి, డ్వాక్రా ఉత్పత్తుల విక్రేతలతో మాట్లాడిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
ఉత్తరాదిన భారీఎత్తున నిర్వహించే కుంభమేళాకు ఏమాత్రం తీసిపోని విధంగా గుంటూరులో ఏర్పాటు చేసిన సరస్ మేళా విజయవంతం అయిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న ఆలోచనల వల్లే ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ గుంటూరుకు తరలివచ్చిందని ఆయన తెలిపారు.
శనివారం సాయంత్రం ఆయన గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, స్థానిక కూటమి నాయకులతో కలిసి హౌసింగ్ బోర్డ్ వద్ద ఏర్పాటుచేసిన సరస్ మేళాను సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తుల్ని పరిశీలించిన ఆయన.. వాటి తయారీ, నాణ్యత, ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్నాక్స్ తిని, టీ తాగారు. బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
*12 లక్షల మంది సందర్శించారు..*
వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు... నాణ్యమైన తమ ఉత్పత్తుల్ని తక్కువ ధరకే సరస్ మేళాలో అందుబాటులో ఉంచారని ప్రత్తిపాటి చెప్పారు. పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో వివిధ రకాల ఉత్పత్తులు దాదాపు 500 స్టాళ్లలో ఏర్పాటు చేశారన్నారు. ఇతర రాష్ట్రాల డ్వాక్రా, మెప్మా మహిళల పనితీరు, ఉత్పత్తుల గురించి ఈ రాష్ట్రంలోని వారు తెలుసుకోవడం.. ఇక్కడి ఉత్పత్తులపై వారు అవగాహన పెంచుకోవడం వల్ల స్వయం సహాయక సంఘాల వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. తొలిరోజు నుంచి ఇప్పటివరకు సరస్ మేళాను 12 లక్షల మంది సందర్శించినట్టు నిర్వాహకులు చెప్పారని ప్రత్తిపాటి తెలిపారు. స్వయం సహాయక సంఘాలను నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని, ఆయన మానసపుత్రికలైన డ్వాక్రా, మెప్మా సంఘాలు జాతీయస్థాయిలో పేరుప్రతిష్టలు పొందడం నిజంగా గర్వించాల్సిన విషయమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. ఆదివారంతో సదస్సు ముగుస్తున్నందున ఇప్పటివరకు చూడని మహిళలుంటే తప్పకుండా మేళాకు హాజరు కావాలని ప్రత్తిపాటి సూచించారు.
సరస్ మేళాను సందర్శించిన ప్రత్తిపాటి వెంట.. టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: