టీడీపీ ఆవిర్భావంతో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ : ప్రత్తిపాటి
• ప్రజాకర్షక పథకాలతో తెలుగువారి హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించిన ధీరోధాత్తుడు ఎన్టీఆర్ : ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు.
ఎన్టీఆర్ అంటే కేవలం వ్యక్తి కాదని, ఆయనొక మహాశక్తి అని, టీడీపీ ఆవిర్భావంతో ఆయనకు ముందు, తర్వాత అనేంతలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఆ యుగపురుషుడు ప్రభావితం చేశాడని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. సామాజిక సంస్కరణలతో పాటు, అనేక ప్రజాకర్షక పథకాలతో తెలుగువారి హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించిన గొప్ప ధీరోధాత్తుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే, ఎంపీలు కొనియాడారు.
*ఎన్.టీ.ఆర్ వర్థంతి సందర్భంగా పలుచోట్ల నివాళులు అర్పించి, అన్నదాన శిబిరాలు ప్రారంభించిన ప్రత్తిపాటి*
ఎన్టీఆర్ 30వ వర్థంతిని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని ఎన్.ఆర్.టీ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే, ఎంపీ ఘన నివాళులు అర్పించి, అన్నదానాన్ని ప్రారంభించి, స్వయంగా ప్రజలకు ఆహారపదార్థాలు వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ నిజంగా కారణజన్ముడన్నారు. అఖిల భారతావని మెచ్చేలా ఆయన సాగించిన సుపరిపాలన, చేపట్టిన పాలనా సంస్కరణలు నేటికీ ఎందరో రాజకీయనాయకులకు దిక్సూచిగా నిలిచాయ,న్నారు. ఎన్. ఆర్.టీ కూడలిలోని విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ప్రత్తిపాటి స్థానిక కూటమినాయకులతో కలిసి అడ్డరోడ్డు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, 26, 27, కళామంధీర్ సెంటర్, 32 భవనృషి నగర, 34,35 కార్డులు సుగాలీకాలనీ, 7వ వార్డు, పసుమర్రు, గోరంట్లవారిపాలెం, నాగభైరువారిపాలెం గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. 7 వ వార్డులో నిర్వహించిన వర్ధంతి సందర్భంగా ప్రత్తిపాటి 300మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్.ఆర్.టీ కూడలిలోని మోటార్ మెకానిక్స్ వర్కర్లు, చిరు వ్యాపారులు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ప్రత్తిపాటి ప్రారంభించారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: