నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపురాతనమైన ఆలయంగా పేర్కొంటారు. 

గర్భగుడిలో రంగనాథస్వామి నిజరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. 

త్రేతాయుగం కాలం నుంచి ఈ ఆలయంలో స్వామి పూజలు అందుకుంటున్నట్లు చెబుతారు.
                        

రంగనాయక స్వామి ఆలయం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కలదు. 

ఆలయం పక్కనే ఉన్న జలపాతం వద్ద స్నానాలు ఆచరించవచ్చు. 

ఒక్కరోజు పర్యటన కు నెమలిగుండం (లేదా నెమలిగుండ్ల) ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 

చుట్టుపక్కల స్థానికులు, పర్యాటకులు ముఖ్యముగా పండుగ మరుసటి రోజులలో (సద్ది పండగ) కుటుంబసభ్యులతో, బంధుమిత్రులతో కలిసివచ్చి వనభోజనాలు చేస్తుంటారు.

 మీరు కూడా వీలైతే శని, ఆది వారాలలో లేదా సెలవుదినాలలో ఇక్కడికి వచ్చి గడపండి. 

ఇక్కడికి ఎలా చేరుకోవాలో ? 

ఏమేమి చూడాలో ఒకసారి. తెలుసుకుందాం...
       

గుండ్ల బ్రహ్మశ్వర ఆలయం సమీప పర్యాటక ప్రదేశాలు...!!!!
                
నల్లమల అడవిలో
           
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివానిపుల్లల చెరువు కు పడమటి దిక్కున ఆరు కిలోమీటర్ల దురంలో వున్న నల్లమల అటవి ప్రాంతంలో నెమిలిగుండల్ల రంగనాయకస్వామి దేవాలయం ఉంది.
              "మయూర మహర్షి"
      
నల్లమల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఎర్పరుచుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకోడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కుపుటమతో ఒక గుండమును తవ్వి మట్టిని బయటకు తీయడంతో మరుసటి సూర్యోదయానికి గుండం జలయంగా మారిందని ప్రతీతి...

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం...

నెమెలిగుండ్ల రంగనాయకస్వామి నెమలి ముఖ ఆకారంతో వున్న మహర్షిచే నిర్మితమైనందున నెమిలిగుండం అనే పేరు వచ్చింది. 

దీని చేంతనే మహా విష్ణువు రంగనాయకస్వామిగా వెలయడంతో నెమెలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంగా వాసికెక్కింది.

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం
పెళ్ళడాలనీనల్లమల్ల కొండలలో ఇసుకగుండమనెచోట చెంచు జాతికి చెందిన బయన్న, బయ్యక్క దంపతులుండేవారు. 

వారి ఏకైక కుమార్తె పేరు రంగ. పెళ్ళిడు కొచ్చిన రంగ తన కులాచారాన్ని దిక్కరించి, కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్ళడాలనీ తలంపుతో చెంచుగూడెం వదలి నెమిలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది.

స్వయంభుగా
మనో భీష్ట సిద్దికోసం మహర్షితో కలసి తపమాచరించిది. 

ఎట్టకేలకు వారి తపస్సుకు చలించిన విష్ణువు ప్రసంన్నుడై రంగను భార్యగా... స్వీకరించెను. మయార మహర్షి కొరిక మేరకు నెమలిగుండం ప్రక్కనే పడమటి కొండపైన స్వయంభుగా వెలసి భక్తుల పాలిట ఆరాధ్యదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు.

చిత్రకృప నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం
ఉపవాసాలుఈ ప్రదేశాన్ని లక్ష్మణ వనంగా పిలుస్తారు. 

ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ రంగనాయక స్వామికి వుంది. 

గత కొన్ని సంవంత్సరాలుగా ప్రతి ఏటా చేత మాసంలో
ఉపవాసాలుఈ ప్రదేశాన్ని లక్ష్మణ వనంగా పిలుస్తారు. ఏ క్షేత్రంలో కనిపించనిఅరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ్ల రంగనాయక స్వామికి నుండి.గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా చైత్ర మాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియలో మూడు రోజుల పాటు ఉపవాసాలు నిర్వహిస్తారు.

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంసాయంత్రం 6 అయ్యిందంటే ఆలయాన్ని శని మాత్రమే తెరుస్తారు మరియు సాయంత్రం 6 అయ్యిందంటే ఎవ్వరినీ అనుమతించరు.

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం.

నెమలిగుండాన్ని 'గుండ్లకమ్మ' జన్మస్థానం అని అంటారు. 

ఏడాది పొడవునా ఈ జలపాతం జాలువారుతూనే ఉంటుంది. 

ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం, ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది.

గిద్దలూరు

నెమలిగుండం వెళ్లాలంటే గిద్దలూరు, మార్కాపురం, నంద్యాల ప్రాంతాల నుండి ప్రతి శనివారాలలో బస్సులు ఉంటాయి. 

కానీ చాలా తక్కువగా నడుతాయి.

అయితే గిద్దలూరు నుండి ప్రవేట్ ఆటోలు ఉంటాయి.

 ప్రయాణ సమయం: గంట లేదా గంటన్నర గిద్దలూరు లో రైల్వే స్టేషన్ కలదు.

చిత్రకృప నెమలిగుండ్ల రంగనాయక స్వామి
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: