జనత వారిది కార్యక్రమంలో అమరావతి మండలం నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం పల్నాడు జిల్లా కలెక్టర్ కు బీజేపీ నుండి పిర్యాదు ఇవ్వడం జరిగింది

*అమరావతి మండలం ఏండ్రాయి గ్రామం లో పెద్దెఎత్తున‌ మైనింగ్*

*ప్ర‌భుత్వాదాయానికి భారీ గండి*

*కొండ‌ల‌ను పిండి చేస్తున్న వైనం*
 
*గూడ్స్ రైళ్ళ‌ను త‌ల‌పిస్తున్న లారీలు*

*అమ్మో ఆ మైనింగ్ వైపు చూడా ల‌న్నా భ‌య‌మే*
 
*కూట‌మి ఆశ‌యాల‌కు తూట్లు*
 
*అమరావతి మండలం ఏండ్రాయి గ్రామ పరిసరాల సి ఆర్ డి ఏ ల్యాండ్ పుల్లింగ్ లొ ఉన్న భూములు లోయ‌లౌతున్న కొండ‌లు*

*ముడుపుల మ‌త్తులో మైనింగ్.... నిద్రావ‌స్ధ‌లొ రెవిన్యూ శాఖ‌*

*క‌బ్జాకు గుర‌వుతున్న అట‌వీ, అస్సైన్డ్ భూములు.... దొపిడీ అవుతున్న ప్ర‌కృతి సంప‌ద‌*

*ప్ర‌జాప్ర‌తినిధుల అండ‌తో జ‌రుగుతున్న దొపిడీని ఆపేవారెవ‌రు*

అమ‌రావ‌తి నిర్మాణం కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, మంత్రులు అహ‌ర్నిస‌లు శ్ర‌మిస్తున్నారు. రాష్ట్ర‌నికి నిధులు రాబ‌ట్టి సుంద‌రంగా తీర్చిదిద్ది దేశంలోనే ఆంద్ర‌ప్ర‌దేశ్‌ను అగ్ర‌గామిగా నిల‌పాల్న ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు శ్ర‌మిస్తున్నారు. ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ ప్ర‌భుత్వ ఖ‌జానాను నింపాల్సిన ప్ర‌జాప్ర‌తినిధులే అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డుతూ ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. స్వార్ధ రాజ‌కీయాల‌ను ప్ర‌క్క‌న పెట్టి వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌ను చూడ‌కండా వ్య‌వ‌స్ధ కోసం పాటు ప‌డాల‌ని అనేక సంద‌ర్భాల‌లో ముఖ్య‌మంత్రి వ‌ర్యులు చెబుతున్నారు. అయినా కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌ను సైతం పెడ‌చెవిన పెడుతున్నారు.సదరు విషయం పై స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోని వైనం అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలొ ఫిర్యాదు చేసిన బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ. వెంటనే ప్రభుత్వ అధికారులు ఈ సమస్య పరిష్కార నిమిత్తం  వెంటనే మైనింగ్ ఆపివేయాలని డిమాండ్ చేస్తున్న పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: