ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ లేదా ఆర్సీ సీజ్

కొత్త నిబంధనలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం 

చలాన్ వచ్చిన 45 రోజుల్లో వాహనదారులు ఫిర్యాదు చేసి తమ అభ్యంతరాలను తెలిపేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పోలీస్ యంత్రాంగం

వాహనదారుడి ఫిర్యాదును పరిశీలించి, అధికారులు నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయానికి అంగీకరిస్తే 30 రోజుల్లో చలాన్ కట్టాలని, లేదంటే 50% చలాన్ కట్టి కోర్టుకు వెళ్లొచ్చని, కోర్టుకు వెళ్లకపోతే చలాన్ కట్టడానికి 15 రోజులు గడువు ఇచ్చేవిధంగా నిబంధనలు అమలు చేసేలా ప్రణాళికకు పోలీస్ శాఖ ఏర్పాట్లు

ఫిర్యాదు గురించి పూర్తి పరిష్కారం లభించినా కూడా చలాన్ కట్టకపోతే లైసెన్స్, ఆర్సీ సీజ్ అవ్వడమే కాకుండా, వాహనానికి సంబంధించిన అన్ని ఆర్టీఏ సేవలు డీ–యాక్టివేట్ అయ్యేలా, చలాన్ చెల్లిస్తేనే ఆర్టీఏ సేవలు తిరిగి యాక్టివేట్ అయ్యేలా నిబంధనలు

ఈ అంశంపై త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న పోలీస్ శాఖ అధికారులు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: