దుబాయ్‌లో మంచు విష్ణు ఫ్యామిలీ.. ఆకాశంలో దూసుకొస్తున్న ఇరాన్ మిస్సైల్స్
*ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్‌పై చేస్తున్న దాడులు.. తిరిగి ఇరాన్ చేస్తున్న ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది*.
*ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల రాజధానులైన దుబాయ్, రియాద్, అబుదాబీ, దోహా, మనామా నగరాలు వణికిపోతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లోని దుబాయ్‌పై ఇరాన్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో షేర్ చేశారు*.
*మంచు విష్ణు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో ఉన్నారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దెబ్బకు తాను నివసిస్తున్న ఇల్లు షేక్ అయిందని ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆకాశంలో ఇరాన్ మిస్సైల్స్ దృశ్యాలను పంచుకున్నారు. ఆ క్షిపణుల భారీ శబ్దాలు తన కుమార్తె ఐరాను భయపెట్టాయని చెప్పారు. ఎవరూ ఇలాంటి యుద్ధ వాతావరణంలో పెరగకూడదని అన్నారు. శాంతి కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు*.
"*ఈ రాత్రి దుబాయ్‌లో కుటుంబ సభ్యులతో ఉన్నాను. ఆకాశంలో కనిపిస్తున్న క్షిపణుల వల్ల మేము ఉన్న ఇల్లు కంపించింది. ఆ శబ్దాలకు ఐరా చాలా భయపడింది. శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యుఎఇ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం నిజంగా ఎంత దుర్బలమైనదో మనకు గుర్తు చేస్తాయి. బలం కోసం, శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. హర్ హర్ మహాదేవ్" అని మంచు విష్ణు పేర్కొన్నారు*.
Post A Comment:
0 comments: