ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉంగుటూరు శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
*స్టాల్స్‌ను సందర్శించి మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గారు ..*
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను వినియోగించి వారు ఏర్పాటు చేసుకున్న వివిధ వ్యాపార స్టాల్స్‌ను ఎమ్మెల్యే గారు సందర్శించారు. మహిళలు స్వయంగా ప్రారంభించిన చిన్న వ్యాపారాలు, తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి వారి కృషిని అభినందించారు.
*ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు గారు....*
అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసిన మహిళలతో సమావేశం నిర్వహించి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు.
*మహిళల కుటుంబ, సమాజంలో మహిళల పాత్ర, గొప్పతనం గురించి వివరించిన ఎమ్మెల్యే ధర్మరాజు గారు...*
ఈ సందర్భంగా మహిళల గొప్పతనం గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థను బలంగా నిలబెట్టేది మహిళలేనని పేర్కొన్నారు. ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, సమాజానికి మంచి విలువలను అందించడంలో మహిళల పాత్ర అపారమన్నారు. విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో ముందుకు సాగుతూ మహిళలు సమాజ అభివృద్ధికి ప్రధాన శక్తిగా నిలుస్తున్నారని, మహిళలు ముందుకు వస్తే కుటుంబం, సమాజం, దేశం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు.
*మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే గారు ...*
మహిళల సాధికారత, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఇందులో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణ కు శక్తి యాప్ రూపోంధించి శాంతి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వాక్రా మహిళలకు నాటు కోళ్లు పంపిణీ, చిన్న వ్యాపారాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు అందిస్తూ NDA ప్రభుత్వం మహిళల సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతోందన్నారు. త్వరలో NTR విద్యాలక్ష్మి, NTR కళ్యాణ లక్ష్మీ పథకాలను అమలులోకి తీసుకురాబోతున్నట్టు తెలిపారు.
*మహిళా ఎంటర్ప్రిన్యూర్ లకు సర్టిఫికెట్స్ అందజేసిన ఎమ్మెల్యే ధర్మరాజు గారు....*
ఉంగుటూరు నియోజకవర్గంలో NDA కూటమి ప్రభుత్వం అందించిన రుణాల ద్వారా వ్యాపారాలు స్థాపించిన మహిళ ఎంటర్ ప్రిన్యూర్ లకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ను అందజేశారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వివిధ పథకాల నిమిత్తం నాలుగు మండలాల ఉన్న లబ్దిదారులకు ఇచ్చిన అమౌంట్ చెక్కును అందజేశారు.
*ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన ఎమ్మెల్యే*....
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని మహిళలతో కలిసి సమావేశ ప్రాంగణంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శ్రీమతి శరణాల మాలతీ రాణి గారు, ఉంగుటూరు నియోజకవర్గ విజన్-2047 స్పెషల్ ఆఫీసర్ హార్టికల్చర్ DD కె. షాజ నాయక్ గారు, మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, జనసేన, టీడీపీ, బీజేపీ మహిళా నాయకులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, APMలు, వివిధ శాఖల మహిళా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: