నిరుద్యోగులకు ఇది నిజమైన ఉగాది పండుగ.... మేడికొండ విజయ్
తెలుగు యువత నాయకులు, అవనిగడ్డ నియోజకవర్గం
*మాట ఇచ్చాడు జాబ్ క్యాలెండర్ తెచ్చాడు లోకేష్ బాబు*
యువత భవిష్యత్తుకు జాబ్ క్యాలెండర్ ఉగాది కానుకగా నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం హర్షనీయమని మేడికొండ విజయ్ పేర్కొన్నారు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి,యువగళం రథసారథి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు ఉగాది పర్వదినం సందర్భంగా 10,060 పోస్టులతో కూడిన భారీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగులకు నిజమైన పండుగని ఆయన కొనియాడారు యువగళం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని లోకేష్ నెరవేస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తీసుకొస్తూనే జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, గత వైసిపి ప్రభుత్వ హయంలో జగన్ నిరుద్యోగులను నిండా ముంచారని యువత ఆశలను అడియాశలు చేశారని విమర్శించారు, కూటమి ప్రభుత్వ హయంలో నిరుద్యోగులకు భరోసా లభిస్తుందని క్రమబద్ధంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతుందని మేడికొండ విజయ్ స్పష్టం చేశారు, యువత భవిష్యత్తుకు ఈ జాబ్ క్యాలెండర్ గొప్ప పునాది అని ధీమా వ్యక్తం చేశారు.
Post A Comment:
0 comments: