చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి 

చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ముందువెళ్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మోహన్దాస్ (71), నాగరాజారావు (61), కుసుమ (61), జయంతి (59), పూజ (33)గా గుర్తించారు.

బెంగళూరులోని రాజాజీనగర్ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. గంగవరం సీఐ రామభూపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రహదారి భద్రత, జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసే ఘటన ఇది.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: