*భద్రాచలం:గోదావరి నదిలో స్నానానికి వెళ్లినవారిలో ఐదుగురు యువకులు గల్లంతుకాగా.. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.*
ఈ ఘటన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమరావతిలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కూనవరం రోడ్డులోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తూ వారిలో ఐదుగురు యువకులు గల్లంతవగా, మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరుకొన్నారు. గమనించిన స్థానికులు వారికోసం బోట్లపై వెళ్లి గాలింపు చర్యలు చేపట్టగా.. చారుగుండ్ల శ్రీకర్ (భద్రాచలం), పొడిచేటి అభిరామ్ (భద్రాచలం), నవదీప్ (ఉయ్యూరు) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరు గోక తేజ (ఉయ్యూరు), పాశం సతీష్ కుమార్ (మదనపల్లి) కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
*మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి*
గోదావరి ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
భవిష్యత్లో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
Post A Comment:
0 comments: