నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని చేనేతలకు శుభవార్త. బుధవారం నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.150 కోట్లు వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640, పవర్‌లూమ్‌పై నేసే కుటుంబానికి రూ.21,600 ఆర్థిక వెసులుబాటు కలగనుంది.
Post A Comment:
0 comments: