ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ.. సీఎం రేవంత్ క్లారిటీ!
తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్.. చివరిరోజున అక్కడి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కేరళం, పాండిచ్చెరి, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.
Post A Comment:
0 comments: