పరిపాలన ఎలా చేయాలో తెలిసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం: గాదె

ఈరోజు లాడ్జి సెంటర్లో ఉన్న గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు పత్రికా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్ గా నిలిచింది అని అన్నారు. గతంలో 24 వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ను మొదటి స్థానానికి తీసుకొని వచ్చిన జనసేన అధ్యక్షులు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో పలు రకాల కంపెనీల నుండి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పనకు రాజధాని నిర్మాణంతోపాటు ప్రతి రంగంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరియు వారికి అండగా నిలబడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేశారు. అలాగే ఐదు లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామని అన్నారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని, ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అని అన్నారు. కానీ  గతంలో వైసీపీ ప్రభుత్వంలో అమరావతి ని నాశనం చేసింది కాకుండా, కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడు మరలా దానిమీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అనేది ఎప్పుడైనా శాశ్వతమని, ప్రభుత్వాన్ని పరిపాలించే పార్టీలు మారినంత మాత్రాన, ప్రభుత్వ విధానాలు మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. ఈరోజున దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాజధాని అమరావతి అని సవరణ చేసుకోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలని అన్నారు. ఇది కేవలం గత వైసిపి ప్రభుత్వం చేసిన దాష్టికం వల్లనే ఈ విధమైన సవరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. అలాంటి పార్టీ గురించి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే ఇటీవల అసెంబ్లీలో అమరావతి మీద తీర్మానం తర్వాత కూడా వైసీపీ నాయకులు కొంతమంది మీడియా ముందుకు వచ్చి వృధా ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. గెలిచిన 11 మందిలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఒక్కరు కూడా బయటికి రాలేదని, ఆ విషయం గురించి గెలిచిన ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండా, ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన వ్యక్తులు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడితే ఎంతో కొంత విలువ ఉంటుందని, కానీ ఎవరిని పడితే వాళ్లని తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడితే, అలాంటి వ్యక్తులను రాష్ట్ర ప్రజలు ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరని అన్నారు. వైసిపి నాయకులు మాట్లాడే మాటలు చూస్తుంటే నాన్న పులి కథ మాదిరిగా అనిపిస్తుంది అని అన్నారు. వైసిపి నాయకులు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని అమరావతి గురించి అసెంబ్లీలో జరిగే తీర్మానానికి హాజరై, తమ మద్దతును తెలియజేస్తారని ఆశించామని, అలాంటి పరిస్థితి ఏమి లేకుండా మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మారి, విధానపరమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఉన్న ప్రతిపక్షం మీరే కాబట్టి, ఏదైనా తప్పు జరిగితే ప్రజల పక్షాన విధానపరంగా మాట్లాడాలని అన్నారు. అలా కాకుండా రోడ్లమీదకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలని చూస్తే అది తిరిగి మీ మీద పడుతుందని హెచ్చరించారు. అలాగే కొంతమంది నాయకులు డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలోనే పెడుతున్నారు అని చెప్పడం చూస్తుంటే వారి అవగాహన రాహిత్యం ఏ పాటితో అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రానికి రాజధాని అవసరమని, గత వైసిపి పరిపాలించిన ఐదు సంవత్సరాలలో రాజధానిని నిర్వీర్యం చేశారని అన్నారు. ఈరోజు రాజధానిని గాడిలో పెట్టామని, వ్యవస్థలు అన్నిటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆ విషయం అవగాహన చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వారిలాగా ఇష్టానుసారంగా డబ్బులు పంచలేదని, రాబోయే రోజులలో రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా తీసుకువచ్చిన అప్పులను పెట్టుబడి పెడుతున్నామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో ఎటువంటి పారదర్శకత లేకుండా ఇష్టానుసారంగా కార్పొరేషన్ల పేరుతో అప్పులు తీసుకొచ్చారని, వాళ్ళు చేసిన అప్పులను వెలికి తీయడంలో ఇప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఆ అప్పులు ఎంత, దేనికి ఎంత తీసుకున్నారో కూడా తేల్చ లేనంతగా బ్యూరో కాట్లు ఉన్నారని అన్నారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం మీద ప్రేమ తగ్గలేక వైసిపి నాయకులతో వ్యక్తిగత మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అధికారులు ఎప్పుడూ కూడా ప్రజలకు ఏది మంచో అదే చేయాలని, ప్రభుత్వాలు మాత్రమే శాశ్వతమని, వాటిని నడిపే పార్టీలు మారతా ఉంటాయని, కానీ అధికారులు మాత్రం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. లేదంటే కటకటాల పాలు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక అప్పుల విషయానికొస్తే వివిధ కార్పొరేషన్ల పేరుతో డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్ర ఖజానా మీద ఎనలేని భారం మోపిన ఘనత వైసిపి ప్రభుత్వానిదని అన్నారు. ఎన్నడూ లేని విధంగా వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు తెచ్చారని, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సుమారు పాతికవేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ బీవర్జస్ కార్పొరేషన్ ద్వారా పదివేల కోట్లు, ఏపీఐఐసీ భూములు తాకట్టుపెట్టి పదివేల కోట్లు, స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇలాంటి వివిధ కార్పొరేషన్ల ద్వారా సుమారు లక్ష కోట్లు పైచిలుకు అప్పులు తీసుకొని వచ్చారని అన్నారు. ఇవన్నీ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్న సుమారు 213 ఎకరాలలో ఉన్న ప్రభుత్వ భవనాలన్నీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి బదిలీ చేసి, వాటిని తాకట్టు పెట్టి సుమారు 1600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని, ఇంకా దారుణమైన విషయం వాళ్లు కూర్చుని పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ ను కూడా తాకట్టుపెట్టి సుమారు 370 కోట్లు అప్పు తెచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా, బటన్ నొక్కాను అనే నెపంతో లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి, రాష్ట్ర ఖజానాను దివాలా దిశగా నడిపించారని ఎద్దేవ చేశారు. చివరికి టిడ్కో ఇళ్ళ మీద కూడా 1500 కోట్ల రూపాయల అప్పు తెచ్చారని అన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అప్పులు తీర్చి నిన్నటి రోజున సుమారు 5 లక్షల మందికి ఇల్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది అని అన్నారు. గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలో తెలియదని, కానీ పరిపాలన ఎలా చేయాలో తెలిసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు రాజకీయ నాయకులుగా, వైసిపి పార్టీ రాజకీయ పార్టీగా మారాలని కోరారు.కావున రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చట్టాల త్రినాథ్, గుంటూరు రూరల్ మండలం నాయకులు శ్రీరామ్ శెట్టి ప్రేమ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: