వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర

దేశ వ్యాప్తంగా LPG కొరత ఉన్న నేపథ్యంలో సామాన్యులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగిపోయింది.

ప్రతి నెల ఒకటో తేదీన ధరల మార్పు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల సిలిండర్ పైన రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.

గత నెలలో ఇదే సిలిండర్ పై రూ.115 పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల దాదాపు మరో వంద రూపాయలు పెరిగింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అయితే, డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు జరుగలేదు. దీంతో గృహవినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: