''మాచర్ల కేంద్రీయ విద్యాలయంలో ఈ ఏడాది నుండే తరగతులు ప్రారంభం''

మాచర్ల కేంద్రీయ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం 2026-27 నుండే తరగతులు ప్రారంభించేందుకు అనుమతులను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఈ ఏడాది నుండే  మాచర్లలోని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు.. ఒక్కో సెక్షన్ కు 40మందితో క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ  కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనం నిర్మాణానికి జాతీయ రహదారి ప్రక్కనే అనువైన 4.56 ఎకరాలను భూమిని కేటాయిస్తూ..ప్రభుత్వం నుండి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విధంగా ఈ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకి అన్ని మార్గాలు క్లియర్ అయ్యాయి. ఈ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ద్వారా మాచర్ల ప్రాంత బిడ్డలకు నాణ్యమైన విద్య చేరువవుతుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. ఏదైతే ఎన్నికల సమయంలో ఈ కేంద్రీయ విద్యాలయాన్ని అందుబాటులో తీసుకొచ్చి విద్యార్థులకు తరగతులను ప్రారంభింప చేస్తామని హామీ ఇచ్చామో, అందుకు అనుగుణంగా కృషి చేసి ఈరోజు ఆ ప్రమాణాన్ని నేను, మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు నిలబెట్టుకున్నాము.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: