రవాణా శాఖ లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచి ఆదాయాన్ని పెంచాల
*ఆదాయం లో టార్గెట్ రీచ్ అయిన పలు జిల్లాల రవాణా శాఖ అధికారులకు అభినందనలు..*
*పలువురు అధికారులు పని తీరు మెరుగుపర్చుకోవాలని హెచ్చరిక*
*సారథి 8 నెలల్లోనే దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది.*
*వాహన్ పోర్టల్ డేటా పూర్తిచేసుకొని టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకోవాలి*
*జూన్ 1 కి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలి*
*AMVI లకు ఇచ్చిన శిక్షణ మాదిరి ఇతర రవాణా శాఖ అధికారులకు విడతల వారిగా శిక్షణ ఇవ్వాలి*
*రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించడానికి రహవీర్ స్కీమ్, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి*
*17 జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలను గుర్తించాలి*
*అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*
*- రవాణా శాఖ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్*
రవాణా శాఖ లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేస్తూ ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రవాణా శాఖ అధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024-25 లో రవాణా శాఖ 6910.90 కోట్లు ఆదాయం వసూలు కాగా ,2025-26 లో 7097 .38 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఈవీ పాలసీ ద్వారా రవాణా శాఖ ఆదాయం కొంతమేర తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. తగ్గిన ఆదాయాన్ని ఎన్ఫోర్స్మెంట్ బలోపేతం చేస్తూ ఆదాయ మార్గాలు పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఇచ్చిన టార్గెట్ రీచ్ అయి లైఫ్ టాక్స్ ,త్రైమాసిక టాక్స్ వసూలు లో మంచి పనితీరు కనబరచిన అధికారులను అభినందించారు. పలువురు అధికారులకు పనితీరు మెరుగు పరచుకోవాలని హెచ్చరించారు.
నిజామాబాద్ - మహారాష్ట్ర , ఆదిలాబాద్ - మహారాష్ట్ర, మెదక్ - కర్ణాటక తదితర సరిహద్దు జిల్లాల రవాణా శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీవో కార్యాలయాల్లో పెండింగ్ లైసెన్స్ ఇతర పౌర సేవలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రవాణా శాఖ లో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాయి రవాణా సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా వాహనదారులకు అందేలా డీలర్ల వద్ద వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందనీ రిజిస్టేషన్ విషయంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రవాణా శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వాహన్ పోర్టల్ ద్వారా సేవలు డేటా పూర్తిచేసుకొని టెక్నికల్ సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సారథి అమలులోకి వచ్చిన తర్వాత 8 నెలల్లోనే దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఏఎంవీఐ లకు ఇచ్చిన శిక్షణ మాదిరి ఇతర రవాణా శాఖ అధికారులకు విడతల వారిగా శిక్షణ ఇవ్వాలనీ అధికారులకు సూచించారు.రవాణా శాఖ గౌరవాన్ని పెంపొందించేలా అధికారులు పని చేయాలని సూచించారు. రవాణా శాఖ లో తమ పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలు పూర్తి చేసి ఇతర సమస్యలు కమిషనర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈనెల 13 నుండి నిర్వహించే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీస్ ,రవాణా శాఖ సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం ,మద్యం సేవించి వాహనాలు నడపడం,ఆటో ల ఓవర్ లోడ్ ,సీటు బెల్టు పెట్టుకోకపోవడం , హెల్మెట్ లేకపోవడం లాంటి వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 13-18 మధ్య అరైవ్ అలైవ్ కార్యక్రమంలో 15 నుండి 18 వ తేదీ మధ్యలో ఉమ్మడి జిల్లాల వారిగా రవాణా శాఖ మంత్రి గా తను ,ఆర్టీసీ ఎండీ , డీజీపీ,రవాణా శాఖ కమిషనర్ సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ మంజూరు అయ్యాయని జూన్ 1 న తొలి టెస్టింగ్ స్టేషన్ ప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం రోడ్డు భద్రతా మాసోత్సవాలు బాగా జరిగాయని కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించిందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్ ల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రేడియం రిఫ్లెక్టివ్ ను కచ్చితత్వం చేయాలన్నారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దాదాపు ఈవీ పాలసీ తీసుకొచ్చిందని ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్లు టాక్స్ మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్క్రాపెజ్ పాలసీ తీసుకొచ్చిందని ఇప్పుడు రాష్ట్రంలో మూడు కేంద్రాలు ఉండగా జిల్లా కేంద్రానికి ఒక ఆర్వీఎస్ఎఫ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిర్భయ ఫ్రేమ్ అందుబాటులోకి రానుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రహవీర్ స్కీమ్ , క్యాష్ లెస్ ట్రీట్మెంట్ లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరంగా హాస్పిటల్ కి తీసుకెళ్లిన వారికి రహవీర్ అవార్డు కింద 25 వేలు బహుమతి అందించనున్నారు. రహవీర్ అమలులోకి వచ్చిన తర్వాత తొలి రహవీర్ నల్గొండ జిల్లాకు చెందిన గణపతి వెంకన్న కి 25 వేల రూపాయల చెక్కు ఇచ్చి అభినందించారు. Pm rahath కింద రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు లక్షా 50 వేల రూపాయల వరకు ఉచిత చికిత్స అందించవచ్చని ప్రజలకు వీటిపై విసృత అవగాహన కల్పించాలని సూచించారు.ఇప్పటి వరకు 25 ప్రాంతాల్లో రవాణా శాఖకు స్థలాలు ఉన్నాయని 17 జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలు గుర్తించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్,ఆర్సీ పెండింగ్ కార్డులు ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక , మైనింగ్ , ఓవర్ లోడింగ్ వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ పెంచాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకానికి ప్రభుత్వ విజ్ఞప్తి తో పలు కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా ఈవి వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు.
సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జెటిసి లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రమేష్, డీటీసీ లు , డీటీవో లు, ఆర్టీవో లు, ఏంవీఐ లు , ఏఎంవీఐ లు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: