రాజమహేంద్రవరంలో నిబంధనలు ఉల్లంఘించిన అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
బుధవారం, గురువారం రెండు రోజుల్లో 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు.
- ఈ బస్సుల్లో ప్రయాణీకుల భద్రతను పక్కన పెట్టి పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్నారు .
- అదనపు డీజిల్ ట్యాంకులను అక్రమంగా అమర్చడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను లగేజీతో మూసివేయడం, వెనుక ఎమర్జెన్సీ డోర్ లేకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయన్నారు.
- సీజ్ చేసిన 5 బస్సులకు సంబంధించి సుమారు ₹2,15,000/- పన్ను మరియు అపరాధ రుసుము బస్సు యజమానులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ హెచ్చరించారు: "నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు."
Post A Comment:
0 comments: