* *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది*

 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వాడిది టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటి నిర్వహణపై వినతి పత్రం సమర్పించడం జరిగింది*

 *నరసరావుపేట జిల్లా కార్యాలయంలో ఈ సోమవారం అనగా మే 12వ తేదీన ఉదయం 10 గంటల నుండి 2 గంటలవరకు జనతా వారది కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది*

 *జనతా వారది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది*

 *ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జనతా వారి కార్యక్రమం ప్రతి గురువారం అన్ని మండలాలలో పార్టీ కార్యాలయలలో అలాగే ప్రతి శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది అలాగే పల్నాడు జిల్లా జనతా వారధి టీం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రాలు స్వీకరించటం జరుగుతుందని తెలియజేసిన పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*

 *మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అలాగే శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయం లో వచ్చే ఫిర్యాదులను అన్నింటిని సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వం వారికి ఫిర్యాదులు అందజేయడం జరుగుతుందని పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు తెలియజేశారు*

“ *నీరు ఉంటేనే జీవితం ఉంటుంది*

*విషయం : భూగర్భ జలాల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుద్ధ్యం, భవిష్యత్ నీటి భద్రత*

*ప్రస్తుతం వాతావరణం లో వస్తున్న మార్పుల కారణంగా  వర్షపాత సరళిలో అనిశ్చితి, పెరుగుతున్న భూగర్భ జల వినియోగం, ఎండిపోతున్న బోర్లు,  క్షీణిస్తున్న చెరువుల సంఖ్య మరియు ఆయకట్టు ఇవన్నీ భవిష్యత్ తరాలకు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సూచిస్తున్నాయి*

ఈ పరిస్థితులను అధిగమించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నీటి భద్రత కల్పించడానికి రాష్ట్రంలో జలవనరుల సక్రమ నిర్వహణ మరియు భూగర్భ జల రీచార్జ్ కు ఇంకుడు గుంటలు (సోక్ పిట్స్, రీచార్జ్ పిట్స్), చెక్ డ్యాం లు, పెర్కొలేషన్ టాంక్ లు, రీచార్జ్ షాఫ్ట్ లు మొదలైన నిర్మాణాల విస్తరణ, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి.

ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో బోర్లు ఎండిపోతున్నాయి, వేసవిలో తాగునీటి కొరత, వ్యవసాయానికి నీటి సమస్యలు, మురుగునీటి నిల్వ, వర్షపు నీరు కాలువల్లో వృథాగా పోవడం వంటి సమస్యలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచడానికి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే శాశ్వత పరిష్కారాల్లో ఇంకుడు గుంటలు (సోక్ పిట్స్ & రీచార్జ్ పిట్స్) ముఖ్యమైనవి.

రీచార్జ్ పిట్స్: వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది; భూగర్భ జల స్థాయి పెరుగుతుంది; బోర్లు, బావులు ఎక్కువకాలం పనిచేస్తాయి; వరద ప్రభావం తగ్గుతుంది; భూమి తేమ పెరిగి వ్యవసాయానికి మేలు చేస్తుంది.

సోక్ పిట్స్: ప్రతి ఇంటినుండి వచ్చే గ్రే వాటర్ భూమిలోకి ఇంకుతుంది; మురుగునీటి నిల్వ తగ్గుతుంది; దోమలు, దుర్వాసనలు తగ్గుతాయి; పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది నిరంతర భూగర్భ జల రీచార్జ్ జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం V B G RAM G, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ్ భారత్ మిషన్ వంటి పథకాల ద్వారా రైన్‌వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్‌వాటర్ రీచార్జ్, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్‌ పై రాష్ట్రాలకు నిధులు, సాంకేతిక మార్గదర్శకాలు, జియో-ట్యాగింగ్, మానిటరింగ్ వ్యవస్థలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది.  “ ప్రతి వర్షపు నీటి చుక్క భూమిలోకి చేరాలి ” అనే లక్ష్యంతో ప్రోత్సాహం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ కీలకం. 2019 వరకు సుమారు 2 లక్షల ఇంకుడు గుంటలు నిర్మించబడ్డాయి. అయితే, తర్వాత నిర్మాణాలు ఆగిపోయాయి; ఉన్నవి నిర్లక్ష్యంతో పూడికతో నిండిపోయాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ కార్యక్రమాలను నిర్వీర్యం చేసింది. 2024 – 2025 లో భూగర్భ జల రీఛార్జ్ లక్ష్యంగా ఇంకుడు గుంటల నిర్మాణం ప్రారంభించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కార్యక్రమం అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లడం లేదు.

భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పిట్స్ అవసరం ఉన్నప్పటికీ అమలు తగిన స్థాయిలో లేదు. ప్రతి గ్రామం మరియు పట్టణాలలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు, వంటి నిర్మాణాల వద్ద రీఛార్జ్ పిట్స్, ట్రెంచ్ లు, రీఛార్జ్ వెల్స్ నిర్మించాలని, మరియు  రోడ్డు డ్రైనేజ్, ఇంటినుండి వచ్చే గ్రే వాటర్ వద్ద సోక్ పిట్స్ వంటి నిర్మాణాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, లోపాలు ఎక్కువై లక్ష్యాల కోసం పనులు మొక్కుబడిగా పూర్తి చేయడం, సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడం, నాణ్యత లేని నిర్మాణాలు, నిర్వహణా లోపం, మట్టితో నిండిపోవడం, పూర్తి కాని పనులను పూర్తి చేసినట్టు చూపడం, ప్రజల్లో అవగాహన లోపం, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రామ స్థాయి పర్యవేక్షణ లేమి కనిపిస్తున్నది.

ఇట్టి పరిస్థితులలో అధికారులు క్రింది అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి 

1. రాష్ట్రవ్యాప్త “గ్రౌండ్‌వాటర్ రీచార్జ్ మిషన్” ప్రారంభించాలి.
2. ప్రతి గ్రామానికి వార్షిక భూగర్భ జల రీచార్జ్ టార్గెట్ నిర్ణయించాలి.
3. ప్రతి ఇంటికి తప్పనిసరిగా రీఛార్జ్ పిట్ మరియు సోక్ పిట్ ఉండాలనే నిబంధన అమలు చేయాలి.
4. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు భవనాలలో వర్షపునీటి సంరక్షణ మరియు భూగర్భ జల రీఛార్జ్ తప్పనిసరి చేయాలి.
5. గ్రామాలలో, పట్టణాలలోని వ్యవసాయ మరియు మంచినీటి చెరువులన్నింటిలో పూడిక తీయడం, చెరువులలోనికి వచ్చే కాలువలను, మార్గాలను శుభ్రం చేయడం వంటి పనుల వార్షిక నిర్వహణకు నిధులు కేటాయించి రైతులు, ప్రజల భాగస్వామ్యం తో ప్రతీ సంవత్సరం తప్పక చేపట్టాలి.
6. ప్రతి పనికి మరియు నిర్మాణానికి జియో-ట్యాగింగ్ & పబ్లిక్ మానిటరింగ్ అమలు చేయాలి.
7. నాణ్యత తనిఖీలకు థర్డ్ పార్టీ ఇన్‌స్పెక్షన్ ఏర్పాటు చేయాలి.
8. గ్రామస్థాయి వాటర్ కమిటీలు ఏర్పాటు చేయాలి మరియు గ్రామ వాటర్ బడ్జెట్ అంచనాలు తయారు చేయించాలి.
9. గ్రామసభల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి గ్రామస్థాయిలో నీటి వనరుల నిర్వహణలో భాగస్వాములను చేయాలి.
10. భూగర్భ జల రీఛార్జ్ నిర్మాణాల నిర్వహణకు ప్రత్యేక వార్షిక నిధి ఏర్పాటు చేయాలి.
11. బావులు, బోర్లు ఎండిపోతున్న మండలాలకు ప్రత్యేక రీచార్జ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి.
12. విద్యా సంస్థలలో వర్షపు నీటి సంరక్షణ మరియు భూగర్భజల రీఛార్జ్ లపై మరియు జలవనరుల సంరక్షణ, సక్రమ నిర్వహణలపై భవిష్యత్ తరాలకు ప్రతినిధులైన విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలతో ప్రతీ సంవత్సరం తగిన అవగాహన, శిక్షణ కల్పించాలి. 

పై అన్నిరకాల కార్యక్రమాల అమలులో అధికారుల నిర్లక్ష్యంపై బాధ్యత నిర్ణయించే వ్యవస్థ తీసుకురావాలి.

ఈ అంశాన్ని సాధారణ అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా, భవిష్యత్ తరాల జీవన భద్రత గా పరిగణించి అత్యవసర ప్రాధాన్యతతో చర్యలు చేపట్టాలని మనవి. 

ఈ రోజే గ్రామ స్థాయి నుంచి నీటి సంరక్షణను ఉద్యమంగా మార్చాలి. “ ప్రతి వర్షపు చుక్క భూమిలోకి చేరాలి—ప్రతి గ్రామం నీటి భద్రత కలిగిన గ్రామంగా మారాలి .”
ప్రభుత్వం ఈ మహత్తర లక్ష్యంతో బలమైన కార్యాచరణ చేపడుతుందని ఆశిస్తూ, ఈ వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాము.
Next
This is the most recent post.
Previous
పాత పోస్ట్
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: