✍️స్వేచ్చాయుత ప్రశాంతంవాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ :జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శు క్లా💐స్వేచ్ఛా యుత ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వ హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అను గుణంగా పటిష్టమైన భద్రత చర్యల నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, గుర్తింపు కార్డులు, ఓట్ల లెక్కిం పు కేంద్రాల్లో ప్రవేశం నిష్క్ర మణ ప్రణాళిక అమలు, సైన్ బోర్డు లు. ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు భద్రతా ఏర్పాట్లపై ఎన్నిక కమిషన్ ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్ భవనాల ప్రవేశ ద్వారం నుంచి కౌంటింగ్ హాళ్ల వరకూ ఉన్న ప్రదేశాన్ని ఒక అంచెగా పరిగణిస్తారన్నారు. ఇక్కడ తగినంత మంది రాష్ట్ర సాయుధ పోలీసులు ఉంటారన్నారు.. ఆడియో, వీడియో రికార్డు చేయగల మొబైల్ ఫోన్లు, ఐ ప్యాడ్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరిక రాలను లోపలకు ఎట్టి పరిస్థితుల లోనూ అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. అలాగే అగ్గిపెట్టె, ఇంకు పెన్నులు, బ్లేడ్లు,చాకులు, పిన్నులు, ఆయుధాలను అనుమ తించరన్నారు.. కౌంటింగ్ ఏజెంట్లు 17 సి నకలు, పెన్సిల్, తెల్లకాగితా లు మాత్రమే తీసుకుని వెళ్ల వచ్చున న్నారు. కౌంటింగ్ కేంద్రం ద్వారం నుంచి మరో అంచె భద్రత ప్రారంభ మవుతుందని. ఆక్కడ సీఆర్పీఎఫ్ సిబ్బందిఉంటారన్నారు. రిటర్నింగ్ అధికారి పిలిస్తే తప్ప ఎవ్వరు కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించరాదన్నా రు. ఏజెంట్లు తమకు కేటాయించిన టేబుల్ వద్ద మాత్రమే కూర్చోవాలని. కౌంటింగ్ హాల్ అంతా తిరిగేందుకు అనుమతిలేదన్నారు. లెక్కింపు విధులకు నియమించిన సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్లు బయట వాహనాలను తనిఖీ చేసి పంపా లని,100 మీటర్లు దూరంలో అభ్య ర్థులు, ఏజెంట్లు, సిబ్బందిని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారి గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతనే కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి ప్రవేశించే ద్వారం దగ్గర మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, కౌంటింగ్ కేంద్రా ల్లో నిబంధనలకు విరుద్ధంగా కవ్వింపు చర్యలకు, ఘర్షణలకు ఎవరైనా పాల్పడితే వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూ చించారు. రాజకీయ పార్టీల అభ్య ర్థులకు, ఏజెంట్లకు, ఉద్యోగస్తులకు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశా మన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పార దర్శకంగా,పక్కాగా నిర్వహించేందు కు పటిష్టమైన ఏర్పాట్లు గావించామ న్నారు ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బాణా సంచా సామాగ్రిని వినియోగించి పౌర జీవనానికి శాంతిభద్రతలకు విఘాతo కలిగించరాదని ఆయన స్పష్టం చేశారు.గెలుపు, ఓటములు సహజమన్న విషయాన్ని గుర్తించి సంయమనం పాటించాలని ఆయన అభ్యర్థులు వారి తరపు అనుచ రులకు ఆయన స్పష్టం చేశారు కౌంటింగ్ కేంద్రం వద్ద శాంతిభద్ర తలకు విఘాతo కలుగకుండా బారీగా పోలీస్, సాయుధ బలగాలు మోహరించాయన్నారు.ఓట్ల లెక్కిం పు ప్రశాంతంగా చేపట్టేందుకు భారీ భద్రతా చర్యలు తీసుకుంటున్నా మని. అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా ఉంచా మని,రాజకీయ పార్టీల అల్లర్లుకు పాల్పడితే క్రిమినల్ కేసులు బనా యించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు అభిమానులు, నేతలు సంమయమనంతో వ్యవ హరించాలని సూచించారు.
Post A Comment:
0 comments: