ఏలూరు : జూన్ 22, 2024 మల్లెల తెలుగుతేజం ప్రతినిధి
*జిల్లాలో అతిసారం, డెంగ్యూ వ్యాదులను అరికట్టెందుకు చర్యలు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్*
ఏలూరు : శనివారం స్థానిక జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ రాజ్ సిబ్బందితో సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ఓహెచ్.ఎస్.ఆర్ ట్యాంకులను క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయించి పంచాయతీ సెక్రటరీ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉందన్నారు. అలాగే త్రాగునీటి శాంపిల్స్ సంబంధిత ల్యాబ్ నందు టెస్టింగ్ జరుగుతుందో లేదో పర్యవేక్షించాలి అన్నారు. ఓ.హెచ్.ఆర్.ఎస్ ట్యాంక్ స్టైయిర్ కేస్ ప్యానల్స్ ఖాళీలు లేకుండా మరమ్మతులు చేయించాలన్నారు. ఈవోపీఆర్డి పంచాయతీ సెక్రెటరీ ప్రతిరోజు గ్రామాలలో పారిశుభ్రతను మానిటర్ చేయాలని ఆదేశించారు. ఏ గ్రామంలో చూసిన రోడ్లు వెంబడి చెత్త డంపింగ్ యార్డ్లను తల్పిస్తుందని పంచాయతీ సెక్రటరీ పర్యవేక్షణ కొరవడిందన్నారు. పంచాయతి సెక్రటరీ, ఈఓపిఆర్డి ఏ ఏ ప్రాంతాల్లో చెత్త పోగుపడుతుందో గ్రహించి తరలింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన లీకేజీలు అరికట్టకపోతే త్రాగునీరు కలుషితమయ్యి డయేరియా ప్రబలుతుందని వెంటనే లీకేజీలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓ.హెచ్.ఆర్.ఎస్, ఎస్.ఎస్, పిడబ్ల్యుడి ట్యాంకుల నీటి నిల్వలను తరచు టెస్టింగ్ చేయించాలని, అలాగే గృహాల్లో వినియోగించే ట్యాంకులను కూడా టెస్టింగ్ చేయడంతో పాటు శుభ్రంగా ఉంచుకునేటట్టు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు *"స్టాప్ డయేరియా కాంపెయిన్"* నినాదంతో డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగితుందని. స్టాప్ డయేరియా కాంపెయిన్ కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసారని. ప్రత్యేక ప్రణాళిక ద్వారా డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు డయేరియా భారిన పడితే బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించడం జరుగుతుందని అయితే సీజన్ మారినందున ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సమాచారం, అవగాహాన, ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత, శుద్ధమైన త్రాగునీరు తదితర అంశాలలో పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ, గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ, విద్యా శాఖ సంయుక్త, వైద్య శాఖ ఆధ్వర్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో తయారు చేసినందున త్వరలో కార్యాచరణ చేపట్టడం జరిగితుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి సందర్శించి ఏమైనా డయోరియా కేసులు నమోదు అయితే డేటాను పరిశీలించి వెంటనే చర్యలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డి..యల్.పి.ఓలు చంద్రశేఖర్, రాజావుల్లా, విస్తరణ అధికారి సరళ తదితరులు పాల్గొన్నారు.
....................................................
జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వారి కార్యాలయం నుండి జారీ చేయడమైనది
Post A Comment:
0 comments: