మన రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్ సమస్యలు పరిష్కరించమని హోంమినిస్టర్ అనిత కు PTLU అభ్యర్ధన.

విజయవాడ: మన రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నామని మా సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత కు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన హోం మినిస్టర్ తో మాట్లాడుతూ.. చట్ట ప్రకారం మా ఉద్యోగాలకు, వేతనాలకు, P.F కు. ఉద్యోగ భద్రతకు, అనేక చట్టాలు, నిబంధనలు, ఉన్నప్పటికీ. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వాటిని పాటించకుండా, మాకు సరైన వేతనాలు ఇవ్వకుండా నిబంధన విరుద్ధంగా ఎక్కువ గంటలు పని చేయించుకుంటూ మా శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్ శారీరిక మానసిక ఒత్తిడికి గురవుతూ చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మా సమస్యలు పరిష్కరిస్తామని గత వైసిపి ప్రభుత్వం మనిఫెస్టో పెట్టి మరి హామీ ఇచ్చినప్పటికి ఏమాత్రం పట్టించుకోలేదని వివరించారు.అందువల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని సుమారు 4 లక్షల మంది ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కుటుంబాలు వైసిపి ఓటమికి, మరియు మన పార్టీ గెలుపుకు ఎంతగానో కృషి చేశారని తెలిపారు.

మీరు మా సమస్యలు పరిష్కరిస్తారని అందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు.మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ఒక్క రూపాయీ కూడా ఖర్చు అవ్వదని ఆమెకు వివరించారు. కాబట్టి మన ప్రభుత్వం మా సమస్యల పరిష్కారని చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత స్పందిస్తూ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: