*గ్రామాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి ఆర్ డబ్ల్యు ఏఈ శ్రీనివాస్ కు ఎమ్మెల్యే వినతి*
కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 18: స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జిల్లాలోని పలువురు అధికారులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ కు నియోజవర్గం ప్రతి గ్రామానికి త్రాగునీరు ఎద్దడి నిర్మూలించాలని మంచినీరు ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని సమస్యలు అంటే పరిష్కరించాలని తెలియజేశారు. జిల్లా పంచాయతీ అధికారి కే. భారతి సౌజన్య ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేయగా ఆయన ఆమెతో మాట్లాడుతూ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉందని ప్రతి గ్రామపంచాయతీకి కార్యదర్శి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని పంచాయతీల్లో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, వీధిలైట్లు సక్రమంగా పనిచేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోట రవి, తోట గాంధీ, జగ్గంపేట ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ రాంజీ, జగ్గంపేట పంచాయతీ సెక్రెటరీ చిరంజీవి రాజు, జువ్వల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: