5000 వచ్చాయి’ మోసపు మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలి – ప్రజలకు చాట్రాయి  ఎస్సై డి రామకృష్ణ హెచ్చరిక

ఇటీవల సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా “నేను ఇది నకిలీ అనుకున్నాను, కానీ 5000 రూపాయలు వచ్చాయి” అనే సందేశాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని ఏలూరు జిల్లా చాట్రాయి  ఎస్సై డి రామకృష్ణ  ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ తరహా మెసేజ్‌లు పూర్తిగా నకిలీవని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని ఆయన సూచించారు.

ఈ మెసేజ్‌లలో ఉన్న లింక్‌లను క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, దాని ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లే అవకాశముందని హెచ్చరించారు. 

ముఖ్యంగా సాధారణ ప్రజలు అమాయకత్వంతో ఈ మెసేజ్‌లను నమ్మి నష్టపోతున్నారని తెలిపారు.

ఇలాంటి సందేశాలు వచ్చిన వెంటనే వాటిని తెరవకుండా డిలీట్ చేయాలి, ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా ఆపాలని ఎస్సై సూచించారు. 

అనుమానాస్పద లింక్‌లు, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఆఫర్లు, బహుమతుల మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సైబర్ నేరాల నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైం హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని చాట్రాయి  ఎస్సై డి రామకృష్ణ ప్రజలను కోరారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: