ముక్కనుమ :
సంక్రాంతి నాలుగో రోజు ముక్కనుమ అంటారు. కానీ ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు కానీ, కొంత మంది కనుమ నాడు కాక ఈ రోజే మాంసాహారాన్ని తినటానికి కేటాయిస్తారు. కొత్తగా పెళ్ళయిన ఆడవారు సావిత్రి గౌరీ వ్రతాన్ని మొదలు పెడతారు. పదహారు రోజుల పాటు చేసే ఈ వ్రతాన్ని గ్రామంలో ఉన్న ఆడవారందరూ కలిసి చేసుకుంటారు. మట్టితో చేసిన గౌరీ దేవి బొమ్మని కుమ్మరి ఇంటినుంచి మేళతాళాలతో తెస్తారు. కుమ్మరికి స్వయం పాకం, దక్షిణ ఇచ్చి గౌరవిస్తారు. అన్ని వృత్తుల గౌరవించటం సంక్రాంతి సంప్రదాయాల పరమార్ధం

Post A Comment:
0 comments: