పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు

 - చిట్యాల సి.ఐ. డి.మల్లేష్

అక్రమాలకు పాల్పడుతూ, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.మల్లేష్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.గత ఏడాది నవంబర్ చివరి వారంలో చిట్యాలలోని శివాజీ విగ్రహం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన మోత్కూరు నరేష్ అనే వ్యక్తిని ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా, 473 రీడింగ్ (తీవ్రస్థాయిలో మద్యం మత్తు) వచ్చింది. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 5 లీటర్ల గుడుంబా లభ్యమైంది.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, అక్రమంగా గుడుంబా తరలిస్తున్నందుకు మరియు మద్యం మత్తులో వాహనం నడిపినందుకు గాను సీఆర్ పల్లికి చెందిన మోత్కూరు నరేష్ మరియు సాదా రాములుపై కేసు నమోదు చేసి,వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.జనవరి 16వ తేదీన నిందితుడు అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తన వాహనాన్ని కావాలనే ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ స్వలాభం కోసం
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: