జిల్లా కోర్టుల అంశంపై శాసన మండలిలో ప్రసంగించిన గౌరవ శాసనమండలి సభ్యులు  మర్రి రాజశేఖర్ 

*మర్రి రాజశేఖర్ గారు శాసన మండలిలో జిల్లా కోర్టుల వ్యవస్థపై ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు.*

*ప్రస్తుతం రాష్ట్రంలో 28 జిల్లాలు ఏర్పాటు చేయబడినప్పటికీ, కొన్ని జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఇంకా పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు, పల్నాడు జిల్లా పరిధిలోని నరసరావుపేట లో జిల్లా కోర్టు పనిచేస్తున్నప్పటికీ, ప్రిన్సిపల్ కోర్టు మాత్రం ఉమ్మడి జిల్లా కేంద్రమైన గుంటూరు లో కొనసాగుతోందని వివరించారు.*

*ఈ కారణంగా పల్నాడు జిల్లాకు చెందిన న్యాయవాదులు మరియు ప్రజలు మొదట గుంటూరుకు వెళ్లి కేసులు ఫైల్ చేసి, అక్కడి నుంచి ఫైళ్లను నరసరావుపేటకు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. దీని వల్ల సమయం, ఖర్చు మరియు శ్రమ పరంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.*

*కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న జిల్లా కోర్టులను ప్రిన్సిపల్ జిల్లా కోర్టులుగా ప్రకటించేందుకు హైకోర్టుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గారిని కోరారు.*
Next
This is the most recent post.
Previous
పాత పోస్ట్
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: