మెట్‌పల్లిలో ‘జనసేన’ జోష్.. గ్లాస్ గుర్తుకు ఓటేయాలంటూ గబ్బర్ సింగ్ బృందం సందడి!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రాజకీయ వేడి రాజుకుంది. శనివారం జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ‘గబ్బర్ సింగ్’ బృందం పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించింది. పురపాలక పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించిన ఈ బృందం సభ్యులు సాయి బాబా, రమేష్, రిమ్సన్ రాజేష్ మరియు మహేష్‌లు.. మార్పు కోసం ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
గ్లాస్ గుర్తుకే తమ ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడంతో జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని, ప్రజలంతా గ్లాస్ గుర్తును ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next
This is the most recent post.
Previous
పాత పోస్ట్
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: