రష్యా చమురు కొనుగోళ్ల గురించి ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందించిన భారత్.. ఏమందంటే..

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని' అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, "దేశ ఇంధన సరఫరా విషయానికొస్తే, 140 కోట్ల భారతీయుల ఇంధన భద్రతకే తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించింది. అందుకోసం మార్కెట్ పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ వాతావరణానికి అనుగుణంగా మా ఇంధన వనరుల్లో వైవిధ్యం తీసుకురావడం మా వ్యూహంలో ప్రధానం. దీనిని దృష్టిలో ఉంచుకునే భారత్ అన్ని చర్యలూ చేపట్టింది. అలానే కొనసాగిస్తుంది" అని అన్నారు.

దీనికి ముందు, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖారోవా బుధవారం మాట్లాడుతూ రష్యాతో ఇంధన సహకారంపై భారత్ తన వైఖరిని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ వాణిజ్యం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: