గద్వాల్: పంచాయతీ కార్యదర్శికి ఏసీబీ షాక్

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పురం పంచాయతీ కార్యదర్శి రంగన్న, పేద లబ్ధిదారుడికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి క్లియరెన్స్ ఇవ్వడానికి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో, ఏసీబీ అధికారులు రంగన్నను ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో రూ.15 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేదలకు అందాల్సిన పథకాల విషయంలో లంచం అడిగితే సహించేది లేదని ఏసీబీ అధికారులు తెలిపారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: