పపిల్లల ప్రాణాలతో చెలగాటం: అప్పాపురం అంగన్‌వాడీలో ‘కుళ్ళిన’ దందా!

​గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురం గ్రామం ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం పసిపిల్లల పాలిట శాపంగా మారింది. బలవర్థకమైన ఆహారం అందించాల్సిన చోట, కుళ్ళిపోయి కంపు కొడుతున్న కోడిగుడ్లను చిన్నారులకు పెడుతూ అధికారులు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పౌష్టికాహారం పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ, చిన్నారులకు మాత్రం విషతుల్యమైన ఆహారాన్ని అంటగడుతున్న ఈ నిర్లక్ష్యపు తీరుపై తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు. లాభాల కక్కుర్తితో కాంట్రాక్టర్లు, పర్యవేక్షణ లేని అధికారులు కలిసి చేస్తున్న ఈ ‘కుళ్ళిన’ దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లల నోటికాడ ముద్దను విషం చేస్తున్న ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే, ఈ నిరసన జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: