జగన్ మత్స్యకారుల కడుపుకొడితే.. చంద్రబాబు వారి బతుకుదెరువు అయ్యారు : ప్రత్తిపాటి
• పోర్టులు, తీరప్రాంతాలను తన తాబేదార్లకు దోచిపెట్టినప్పుడు జగన్ కు మత్స్యకారుల జీవనోపాధి కనిపించలేదా? : ప్రత్తిపాటి
• జీవో 217 తో మత్స్యకారుల కడుపుకొట్టినప్పడు జగన్ కు వారి బతుకుదెరువు గుర్తురాలేదా? : ప్రత్తిపాటి
• మత్స్యకార బీమా, డీజిల్ రాయితీ. వేట నిషేధ భృతి, వేట సామర్థ్యం పెంపునకు మంగళం పాడిన ఘనుడు జగన్ : ప్రత్తిపాటి
“ అవినీతి.. దౌర్జన్యం..దోపిడీలకు పాల్పడి జైలుపాలైన వైసీపీనేతల్ని పరామర్శించే జగన్..అలవాటులో పొరపాటుగా మత్స్యకారుల వద్దకు వెళ్లినట్టున్నాడు. ఆయన ప్యాలెస్ లలో ఉండటమే రాష్ట్రానికి శ్రేయస్కరం.. ప్రజలకు సంతోషకరం. అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల కష్టార్జితాన్ని, ఫిష్ మార్ట్ ల పేరుతో వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టిన జగన్.. నేడు మత్స్యకారుల సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నాడు. రాష్ట్రంలోని పోర్టులను తన తాబేదార్లకు, తీరప్రాంతాన్ని తన పార్టీ నాయకులకు ధారాధత్తం చేసినప్పుడు జగన్ కు మత్స్యకారుల ఉపాధి గుర్తురాలేదా? మత్స్యకారుల కడుపుకొట్టేలా, వారికి జీవనోపాధి లేకుండా జీవో ఎం.ఎస్- 217 తన ప్రభుత్వంలో విడుదల చేసినప్పుడు జగన్ కు వారి బతుకు దెరువు కనిపించలేదా? అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులపై పగబట్టిన జగన్.. నేడు వారికి అండగా నిలుస్తున్నట్టు రాజకీయ రంగులు మారుస్తున్నాడు. గతంలో జగనన్నతోడు.. మత్స్యకార భరోసా పేరిట జాలర్లను నమ్మకమనే వలలో బంధించి, మోసం, వంచన అనే చేపల్ని వారికి బహుమతిగా అందించిన ఘరానా మోసగాడు జగన్. ఎన్ని కట్టుకథలు చెప్పినా.. ఎన్ని వేషాలు వేసినా.. జగన్ మనసునిండా మత్స్యకారులపై నిలువెల్లా విద్వేషమే ఉంటుందనేది ఎప్పటికీ కాదనలేని పచ్చి నిజం.
*ఆది నుంచి మత్స్యకారులకు అండగా నిలిచింది చంద్రబాబే*
మత్స్యకారులకు ఆదినుంచి అండగా నిలిచి, వారికి అన్నివేళల్లో రక్షకుడిగా నిలిచింది చంద్రబాబే. బీమా, ఉపాధి కల్పన, డీజిల్ రాయితీ, ఫిషింగ్ జెట్టీల నిర్మాణం, వేట సామర్థ్యం పెంపు, జీపీఎస్ పరికరాలు అందచేతతో మత్స్యకారుల జీవనోపాధి మార్గాలు పెంచింది టీడీపీ ప్రభుత్వమే. కాకినాడ, మచిలీపట్నం హార్బర్ల అభివృద్ధితో వారి జీవనోపాధికి భరోసా కల్పించింది చంద్రబాబు.
ఫిషరీస్ ఎగుమతుల ప్రోత్సాహానికి కోల్డ్ చెయిన్ వ్యవస్థ, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుది. వేట నిషేధ సమయంలో నిత్యావసరాలు, బియ్యం అందించి మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ప్రకృతి విపత్తులు, తుపాన్లను ముందే పసిగట్టి, జాగ్రత్తపడేలా సాంకేతిక పరిజ్ఞానంతో వారి జీవితాలకు భద్రత కల్పించడం ద్వారా అసలైన బతుకుదెరువు అందించిన చంద్రబాబు.., మత్స్యకారులకు నిజమైన రక్షకుడు అయ్యాడు .” అని మాజీమంత్రి ప్రత్తిపాటి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
Post A Comment:
0 comments: