నీటి భద్రత - సాగు నీటి సంఘాల భాద్యత అనే మహాద్బుతమైన కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత సంతోషంగా ఉంది చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు
రాష్ట్రంలో సాగునీటి వనరులను సంరక్షించుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు అవసరమైన వనరులు కల్పించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే నేడు సాగునీటి రంగం బలోపేతం కోసం ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంది.
ఈరోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ప్రభుత్వ ఆదేశాలతో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చెరువు వద్ద నిర్వహించిన " నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత " కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నీటి భద్రత, రైతుల కొరకు చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా చెరువులు పునరుద్ధరణ పనులు, పూడీకతీత పనులుతో చెరువులను సంరక్షించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకొని క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించవచ్చు అని, ప్రజలందరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో గారు మున్సిపల్ కమిషనర్ AMC చైర్మన్ అధికారులు రైతులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: