అమరావతి సాధనలో టీడీపీ కట్టుబాటు – ప్రజల పోరాటానికి న్యాయం జరిగింది: శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు..
*అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించడం తెలుగుదేశం పార్టీ తీసుకున్న దృఢమైన నిర్ణయాలకు, ప్రజల పోరాటానికి వచ్చిన విజయమని శాసన మండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు పేర్కొన్నారు.అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించినందుకు రైతులు మహిళలు ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… అమరావతి కోసం 1631 రోజుల పాటు నిరంతరంగా పోరాడిన రైతులు - మహిళలు చేసిన త్యాగం, దీక్షలకు చివరికి న్యాయం జరిగిందన్నారు.*
*తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అమరావతి పట్ల తన నిబద్ధతను స్పష్టంగా చూపిస్తూ వచ్చిందని, ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో ఎలాంటి రాజీ పడలేదని అన్నారు. ముఖ్యంగా మహిళలు చేసిన త్యాగం, వారి ఆత్మస్థైర్యం ఈ ఉద్యమానికి బలంగా నిలిచిందని కొనియాడారు.*
*అమరావతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడానికి ప్రయత్నించిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పారని తీవ్రంగా విమర్శించారు. ప్రజా సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఈ పోరాటం నిరూపించిందన్నారు.*
*ఈ చారిత్రాత్మక నిర్ణయానికి తోడ్పడిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.*
*ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి నాయకులు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.*
*ప్రజల విశ్వాసమే తమ బలం అని, అభివృద్ధే తమ లక్ష్యమని మర్రి రాజశేఖర్ గారు అన్నారు.*
.
Post A Comment:
0 comments: