తెలంగాణ రాజకీయాల్లో 'సెంటిమెంట్' మరియు 'సంక్షేమం' ఎప్పుడూ కీలకమే. తాజాగా ఆదిలాబాద్ గడ్డపై నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా లోకానికి ఒక తీపి కబురు అందించారు.
గతంలో ఇందిరమ్మ పాలనలో చీరల పంపిణీ జరిగిన తీరును గుర్తు చేసుకుంటూ.. "నాడు మా అక్కలు పాలపిట్టల్లా మెరిసిపోయారు, ఇప్పుడు మళ్ళీ అదే ఉత్సాహాన్ని నింపుతాం" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఈసారి డిసెంబర్ నెలలో రాష్ట్రంలోని మహిళలందరికీ 'చిలకపచ్చ రంగు' చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.
కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా, దీనికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అక్కడికక్కడే కోరడం విశేషం. ప్రభుత్వం ఇచ్చే ఈ కానుకను ఒక 'పుట్టింటి సారె'గా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ డిసెంబర్ నాటికి తెలంగాణ ఆడబిడ్డల ముఖాల్లో చిలకపచ్చ వెలుగులు చూడబోతున్నాం!
Post A Comment:
0 comments: