శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ధ్యేయంగా పట్టణంలోని పీఆర్ గెస్ట్ హౌస్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించడం జరిగింది.
*ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను వ్యక్తిగతంగా పరిశీలించాను. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు మరియు ఇతర వ్యక్తిగత సమస్యలపై అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులతో మాట్లాడి, అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించాను.*
*నా దృష్టిలో పదవి అనేది కేవలం హోదా కాదు, ప్రజలకు సేవకుడిగా అండగా నిలవడానికి దక్కిన ఒక గొప్ప అవకాశం. మీ సమస్య ఏదైనా, మీకు తోడుగా ఉండటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.*
Post A Comment:
0 comments: