********************
కార్పొరేట్ సృష్టిస్తున్న వైద్య సిలబస్ ను రద్దు చేసి ఆ స్థానంలో వాస్తవిక వైద్య శాస్త్రన్ని అధ్యయనం చేయాలి .
చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సైతం అత్యంత ఖరీదైనవిగా అమలు జరగటం బాదాకారం .
వైద్య పరీక్ష లకు ఒక నిర్థిష్ట ధర పట్టికను అమలు చేయాలి ..
*************************
మేడా శ్రీనివాస్ , ఆవేదన ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
*************************
సైన్స్ ముసుగులో ఖరీదైన కార్పొరేట్ మోసాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూడటం అన్యాయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఏద్దేవా చేసారు .
వైద్య విద్య పూర్తిగా కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయిందని , వైద్య విద్యార్డులుకు మానవ శరీర అవయవాల పైన , ఆరోగ్య సమస్యల పైన అధ్యాయనం చేసే విధంగా పాఠ్యంసాలను భోదించటం లేదని , ఖరీదైన వ్యాపార దృక్పధ కోణంలో వైద్య శాస్త్రన్ని కార్పొరేట్ శక్తులు వసపరచుకున్నాయని , వైద్య సిలబస్ ను సైతం వైద్య వ్యాపార సామ్రాజ్యానికి అనుగుణంగా విస్తరించే విధంగా విద్యార్థులకు వైద్య కళాశాలల్లో భోదనలు బోదిస్తున్నారని , రోగాలు తగ్గించటం పై సిలబస్ ను బోధించకుండా , ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ఒక రోగి నుండి లక్షల్లో కాసులు కురిసే విధంగా వాస్తవ వైద్య శాస్త్రానికే అంతు పట్టని వైద్య సేవలు రోగికి జరుగుచున్నాయని , ఒకసారి ఒక చిన్న అనారోగ్య సమస్యపై రోగి ఒక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి కార్డు రాయించుకుంటే చాలు
ఆ రోగి జీవించి వున్నన్నాళ్ళు ఏటా మూడు సార్లు ఆ రోగి తప్పనిసరిగా ఆ ఆసుపత్రిని సంప్రదించే విధంగా వ్యూహత్మక వైద్య సేవలు జరుగుతున్నాయని , అసలు పుట్టిన వైద్య శాస్త్రం నేడు లేదని , ఆ సిలబస్ ను అగ్నికి ఆహుతి చేసేసారని , ఆ స్థానంలో కార్పొరేట్ మాఫియా తయారు చేసిన వైద్య శాస్త్రన్ని అవపోషాణ పట్టి అర్హత గల వైద్యుల మంటు వైద్యం చేస్తున్నారని , నేడు అనేక మందికి వైద్య శాస్త్రం పై అవగాహన లేకపోయినా చైనా , రష్యా సిలబస్ చదివాం అంటు ఆ దేశ సర్టిఫికెట్టులతో వైద్యలుగా చలామణి అయిపోతు మనుషుల ప్రాణాలు తీస్తున్నారని , ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రి ల నిర్వహణల పైన , సౌకర్యాల పైన, నిబంధనలు పైన కనీస పర్యవేక్షణ లేకుందని ,
డి. ఎమ్ & హెచ్ ఓ శాఖలు పనితీరు అంత అవినీతి కాసులు దండుకోవటం పై ఉన్న ధ్యాస ప్రజల ఆరోగ్య భద్రతా సౌకర్యాల పై లేక పోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు ..
చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సైతం ఆసుపత్రి కి వెళ్లిన తరువాత ప్రమాద కర పరిస్థితులకు చేరుకుంటున్నాయని , వైద్య శాస్త్రం పై సరైన అవగాహన లేని రోగి తరుపు వారు కార్పొరేట్ వైద్యలు చెప్పిన మెడికల్ కార్పొరేట్ బాషతో అర్ధం కానిది , అర్ధమయ్యేది కలిపి వారికి అర్ధమయ్యిందనే విధంగా తృప్తి పరిచి వారిని ఆర్ధికంగా దోచుకుంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రికి మేలు జరిగే విధంగా రోగి కుటుంబ సభ్యులతో అత్యంత గౌరవంగా , మర్యాదగా మెలిగి రోగి వారు అనుకున్న విధంగా డబ్బును లాక్కుంటారు . ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వైద్యులకు రోగికి మెరుగైన వైద్య సేవలు అందించటంలో కన్నా మంచి ఆప్యాయతతో గల మాటలతో ఆసుపత్రి యాజమాన్యంకు లాభం చేకూర్చే మాటలను త్వర్పిదు పొందుతు వారు సమిష్టిగా లాభపడుతున్నారని , నేడు రోగికి బాధ్యత తో కర్తవ్యంగా వైద్య సేవలు అందించే వైద్యులు అతి తక్కువ మంది వున్నారని , సమాజంలో నేడు ప్రతి మనిషి 99.99 % ఏదో ఒక ట్యాబ్లేట్ వేసుకోకుండా లేరని , అందుకు కార్పొరేట్ సిలబస్ తో వైద్యులు కాబడిన వైద్యలే కారణమని , కాలం చెల్లిన మందుల కంపెనీలకు సంబందించిన మందులను రోగికి అందిస్తు రోగాలు పెరగటానికి కారకులవుతున్నారని , భగవంతుడు తో సమాన మైన వైద్య వృత్తిలోను , వైద్య శాస్త్రం భోదనలోను మానవత్వంతో కూడిన మెరుగైన సంస్కరణలు రావాలని , అప్పుడే వైద్యంకు విశ్వ వ్యాప్తంగా ఆశీస్సులు దక్కుతాయని ఆయన పేర్కొన్నారు.
వైద్య శాస్త్రన్ని ఏళ్ల తరబడి చదివి కూడా ప్రతి చిన్న చిన్న కారణాలకు రక్త పరీక్షలకు వైద్యులు సూచించటం రోగులకు ఖరీదైన ఆర్ధిక భారంగా మారిందని , ఒకొక్క రక్త పరీక్ష కేంద్రంలో ఒకొక్క ధర వుంటుందని , రక్త పరీక్ష నమూనా విధానం ఒక్కటే అయినప్పటికీ లేబరేటరీ ల్లో రక రకాల ధరలతో రోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని , సంబందిత అధికార యంత్రాంగం కూడా అవినీతి ముడుపులుతో చోధ్యం చూస్తు రోగులకు తీరని ద్రోహం చేస్తున్నారని , సైన్స్ ముసుగులో కార్పొరేట్స్ రూపొందించిన సిలబస్ ను యువ వైద్యుల బుర్రల్లోకి ఎక్కిస్తు వైద్య శాస్త్రన్ని ఖరీదైన కార్పొరేట్ మెడికల్ మాఫియాకి తాకట్టు పెట్టేసారని , కంటి రెప్ప, నాడి, నాలుక, గోర్లు పరీక్షించి రోగం చెప్పగలిగే ఆ నాటి వైద్యులు నేడు ఒక్కరు కూడా లేరని , ఆ నాటి వంటింటి బామ్మలకు తెలిసిన రోగం నయం చేయగల చిట్కాలు కూడా నేటి వైద్యులకు తెలియదని,భారతదేశంలో వైద్యం భూత వైద్యం కన్నా ప్రమాదంగా మారిందని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రం ఆరోపణ చేసారు.
సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ డి వి రమణ మూర్తి , ఎమ్ డి హుస్సేన్, దూడ్డే త్రినాద్ , దూడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్ , దోషి నిషాంత్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, సుంకర వెంకట భాస్కర రంగారావు , అడపా శేషగిరి, అడపా దేవుడు, ఖండవల్లి శ్రీనివాసరావు, జవ్వాది మోహన్, జవ్వాది దుర్గా శ్రీ వల్లి , మాసా అప్పాయమ్మ,, మాసా సుభద్ర తదితరులు పాల్గొని యున్నారు.
--మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..
Post A Comment:
0 comments: