బాలికపై అత్యాచారయత్నం.. జైలు శిక్ష.

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలకు చెందిన రజిని కుమార్ 2023లో ఓ బాలికపై అత్యా చారయత్నానికి పాల్పడగా.. అప్పటి సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జనగామ జిల్లా పోక్సో కోర్టు జడ్జి రవీందర్ శర్మ బుధవారం తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.2 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: