పేపర్ లీక్‌ కేసు.. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై దాడి



పేపర్ లీక్‌ కేసు.. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై దాడి
నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ-నెట్ పేపర్ లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల్ని రద్దు చేసింది. ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం వెళ్లిన సీబీఐ అధికారులపై దాడి జరిగింది. బీహార్‌లోని నవడా జల్లాలో ఉన్న కసియాదిహ్ గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే, నకిలీ అధికారులని భావించి గ్రామస్తులు దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపుగా 200 మందిపై కేసులు నమోదు చేశారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: