మోడీ కాళ్లు పట్టుకునే పనిలో కేసీఆర్ ఉన్నాడు: సీఎం రేవంత్
కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలని కొందరు ఎదురు చూశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 'సమయం, సందర్భం వచ్చినప్పుడు జీవన్ రెడ్డి సేవలను వినియోగించుకుంటాం. ఆయన గౌరవానికి భంగం కలగదని అధిష్ఠానం మాట ఇచ్చింది. కేసీఆర్ ప్రస్తుం మోడీ కాళ్లు పట్టుకునే పనిలో ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో సిరిసిల్లలో బీజేపీ ఎలా ముందుంటుంది. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటానికి కేసీఆర్ కు సిగ్గుండాలి' అని ఘాటుగా స్పందించారు.
Post A Comment:
0 comments: