రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలో ఉదయం 6 గంటల నుండే ఫించన్వల పంపిణీ కార్యక్రమం మొదలైనది.ఎన్నికల హామీలలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి హామీ మేరకు ఏప్రిల్ నెల నుండే నాలుగు వేల రూపాయల ఫించన్ ఇస్తానన్నారు.అందులో భాగంగా ఈ రోజు సోమవారం ఉదయం ఆరు గంటల నుండే ఫించన్ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వడంతో ఫించన్ దారుల ఆనందానికి అవధులు లేవు. రాజుపాలెం మండల జనసేన పార్టీ మండల కార్యదర్శి రుసుం వెంకటేశ్వర్లు మరియు గ్రామ అధ్యక్షుడు ఎగిలి శెట్టి శ్రీరామ్ మరియు టిడిపి నాయకులు మునగా శ్రీనివాసరావు, రుసుం రామారావు, రాం రంగారావు మరియు మరికొందరు టిడిపి జనసేన నాయకులు కలిసి పార్టీ నాయకులకు పాలాభిషేకం చేసి కార్యక్రమం మొదలుపెట్టారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: