🛕18న భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామ దూత స్వామి జన్మ దిన మహోత్సవమ్ 🛕 18వతేదీ మంగళవారం కొత్తపేట మండలం మోడేకుర్రులో వట్టికూటి లలిత- గోవిందరావు స్వగృహం వద్ద భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి వారు జన్మదిన మహోత్సవం జరుగును.ఉదయం 8:30గంటలకు మంగళ వాయిద్యాలతో వేద పఠనము, ఓంకారం, ధ్యాన శ్లోకాలు, శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారి అర్చన, భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి వారు పాదుకా పూజ జరుగును. అనంతరం స్వామి వారు షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించబడును. భక్తుల ప్రసంగాలు, పాటలు, భజనలు, భక్తులతో స్వయంగా స్వామివారి పాదుకులకు పుష్ప వందన కార్యక్రమం. అనంతరం అన్న ప్రసాద వితరణతో కార్యక్రమము సంపూర్ణం.
Post A Comment:
0 comments: