ప్రజలు నిత్యం వినియోగించే కూరగాయలు, బియ్యం, ఉల్లిపాయలు, పప్పుదినుసుల రేట్లు ఆకాశాన్నంటు తున్నాయి. మార్కెట్లో కిలో టమోటా రూ.80/- నుండి రూ.100/-ల వరకు ధర పలుకుతుంది. పచ్చిమిర్చి కూడా అంతకు మించి ధర పలుకుతున్నాయి. ఉల్లిపాయలు కిలో రూ.50/- పైనే ధర పలుకుతుంది. పప్పులు, కారం, పసుపు, చింతపుండు, నూనె ధరలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ధరలను అదుపుచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ధరలు అదుపులోకి వచ్చే వరకు
వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ద్వారా నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఉల్లిపాయలు సబ్సిడీ ధరలకు విక్రయించాలి. అవకాశం లేని చోట రైతు బజార్ల ద్వారా విక్రయింపులు జరపాలని తద్వారా పేదలకు నిత్యావసర ధరలు, కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల సంఘాల సమాఖ్య కోరుతుంది. అందుకు తగిన విధంగా జిల్లా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, నిత్యావసర ధరలు అదుపులో ఉంచేందుకు ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని మా సంస్థ డిమాండ్ చేస్తుందని సంస్థ చైర్మన్ దాసరి దాసరి ఇమ్మానియేలు రాష్ట్ర జనరల్ సెక్రటరీ హెచ్ ఎస్ రామకృష్ణ పత్రికప్రకటన లో కోరారు.
Post A Comment:
0 comments: