*స్వాతంత్య్ర సమరయోధులు చిత్త రంజన్ దాస్
సేవలు చిరస్మరణీయం*
*సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి*
*జూన్ 16 న స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ చిత్త రంజన్ దాస్ గారి వర్థంతి సందర్భంగా*
డోన్ పట్టణం నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ చిత్తరంజన్ దాస్ గారి వర్థంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
*మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు*
చిత్తరంజన్ దాస్ గారు నవంబర్ 5-1874 బెంగాల్ లో జన్మించారు. ఈయన మన దేశ ప్రజలను చిత్రహింసలు పెడుతున్న బ్రిటిష్ వారి ఆగడాలను సహించక స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి బ్రిటిష్ దుస్తులను బహిష్కరించడమే కాకుండా స్వదేశీ ఖాదీని ధరించారు. ఖాదీ పై ప్రజల్లో అవగాహణ పెంచారు. ఈయన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా మన దేశం కోసం చివరి వరకు పట్టుదలతో బ్రిటిష్ వారిపై పోరాడారు.ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో సుభాష్ చంద్ర బోస్ ముఖ్యుడు. ఈయన జూన్ 16 - 1925 న స్వర్గస్తులైనారు. ఇలాంటి మహనీయులను ఎల్లవేళలా స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.
మీ
పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త, డోన్.
Post A Comment:
0 comments: